సోనాక్షి స్పెషల్ సాంగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ హీరోగా తనెంటో నిరూపించుకున్న రామ్‌చరణ్ ధృవ సినిమా నుండి తన పంథాను మార్చుకున్నాడు. కొత్త తరహా కథలతో ముందుకెళుతున్నాడు. అందులో భాగంగా సుకుమార్ దర్శకత్వంలో `రంగస్థలం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా రాజమండ్రి సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అందులో ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారట. సుకుమార్ సినిమాలంటే స్పెషల్ సాంగ్స్ కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడు సక్కు. ఈ సాంగ్‌లో నటింప చేయడానికి సోనాక్షి సిన్హాను ఒప్పించే ప్రయత్నంలో ఉందట యూనిట్. ఇంకా సోనాక్షి నుండి ఎటువంటి విషయం తెలియలేదనేది సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com