నా లవ్‌స్టోరీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది - హీరోయిన్ సోనాక్షి సింగ్ రావత్
Send us your feedback to audioarticles@vaarta.com
అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై జి.లక్ష్మి నిర్మాతగా.. శివగంగాధర్ డైరక్షన్ లో మహిధర్, సోనాక్షి సింగ్ రావత్ లను తెలుగు తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం నా లవ్ స్టోరీ. మునుపెన్నడూ చూడని విధంగా ఈ లవ్ స్టోరీ తన ప్రత్యేకతను చూపుతుందనేలా అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాక్షి సింగ్ రావత్ మీడియాతో ముచ్చటించారు.
అసలు మీ గురించి, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ..
మాది రాజస్థాన్. కానీ పుట్టి పెరిగింది, చదువుకుంది మొత్తం ముంబైలోనే. బిజినెస్ మేనేజ్‌మెంట్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. 16వ సం.లోనే మోడలింగ్ లోకి ఎంటరయ్యా.. యాడ్స్, మోడలింగ్ లో 5 సం.ల నుంచి ఉన్నా.
ఇదే మీ మొదటి సినిమానా.. ఇంతకు ముందేమైనా సినిమాలు చేశారా..?
యాడ్స్ చేశాను చిన్న చిన్నవి అంతేకానీ, సినిమాల పరంగా అయితే ఇదే నా మొదటి ఉద్యోగం. తెలుగు సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, కానీ ఎవరూ నచ్చక సెలెక్ట్ అవలేదని తెలిసి ఫొటోలు పంపాను, టీమ్ చూసిన లాస్ట్ ఫొటో నాదే. నచ్చి హీరోయిన్ గా ఓకే చేశారు. అంతే ఇలా మీ ముందున్నా ఇవాళ.
సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది..?
ఒక మధ్య తరగతి అమ్మాయి పాత్ర నాది. అందరితో తిరిగే టైప్ కాకుండా.. ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ను మెయింటెయిన్ చేసే టైప్ అమ్మాయిగా కనిపిస్తాను. ఎక్కడికీ వెళ్లొద్దు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, నీ బెస్ట్ ఫ్రెండ్ ని కలవాలన్నా తననే ఇంటికి రమ్మని చెప్తూండే తండ్రి. చూడాలి ఎలా కనిపిస్తానో, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..
మొదటి రోజు సినిమా షూటింగ్ ఎలా అనిపించింది?
చాలా టెన్షన్‌గా, భయంగా.. దానికి తోడు ఆ రోజే రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఎలా చేస్తానా ఏంటా అని భయం భయంగానే చేశాను. కానీ మా టీమ్ మొత్తం నాకు డైలాగ్స్ లోనూ, ప్రతీ దాంట్లోనూ చాలా హెల్ప్ చేశారు.
రియల్ లైఫ్ లో కూడా మీ నాన్న అంతే స్ట్రిక్టా..?
లేదు లేదు. మేం నలుగురు అమ్మాయిలు. నాన్న బిజినెస్ చేస్తారు. ఎప్పుడూ మమ్మల్ని ఏ విషయంలోనూ ఫోర్స్ చేయరు. సినిమాలో చూసే నా క్యారెక్టర్ కి, నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కు అసలే సంబంధం ఉండదు.
ఈ సినిమా సైన్ చేసే ముందు ఏమైనా తెలుగు సినిమాలు చూసారా..?
చాలా చూశా.. హిందీ డబ్బింగ్ లో తెలుగు మూవీస్ చూసేదాన్ని. డైరక్ట్ గా తెలుగులో అంటే బాహుబలి, అర్జున్ రెడ్డి థియేటర్లోనే చూశా..
మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్..
అల్లుఅర్జున్ అంటే ఇష్టం. జూ.ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టం, ఎంతో బాగా డ్యాన్స్ చేస్తారు. చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారంటే చాలా ఇష్టం. ఆమె తర్వాత అంటే సుస్మితా సేన్, ఇప్పుడు ప్రియాంకా చోప్రా. నేను స్ట్రాంగ్ గా ఉండే విమెన్ ని బాగా అభిమానిస్తాను.
నటనలో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా..?
లేదు. నేను ట్రైనింగ్ తీసుకుంటే యాక్టింగ్ వస్తుందంటే అది నటన కాదు అనే నమ్ముతాను. ఒక క్యారెక్టర్ ను అర్థం చేసుకుని దానిలో లీనమైనప్పుడే మంచి నటన వస్తుందనేది నా నమ్మకం. డైరక్టర్ శివ గారు చాలా నేర్పించారు నాకు. దానికి తోడు చిన్నప్పటి నుంచి నాకు నేనే అద్దంలో చూసుకుంటూ డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ అనుభవం కూడా ఎంతోకొంత పనికొచ్చే ఉంటుంది (నవ్వుతూ..)
ఇంకేమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా..?
ఇప్పుడే కదా ఈ సినిమా అయిపోయింది. ఇంకా ఏమీ సైన్ చేయలేదు. మంచి స్క్రిప్ట్ చూసి సెలెక్ట్ చేసుకుంటా.
హీరో గురించి..
సెట్ లో ఎవరితో ఏం చెప్పాలన్నా తన దగ్గరికే వెళ్లి చెప్పేదాన్ని. తనకి హిందీ వచ్చు, నేను తనకి చెప్తే తను వాళ్లకి కన్వే చేసే వాడు. హీ ఈజ్ సో స్వీట్. నేను తన ఫ్యామిలీతో కూడా కొన్ని రోజులున్నాను. వాళ్లు నన్ను తమ సొంత కూతురిలా చూసుకునేవారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments