పడక గదిలో అంటూ డర్టీ కామెంట్స్.. శృంగార తార మనస్తాపం
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్లు, నటీమణులపై చిత్ర పరిశ్రమలో ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని రూమర్స్ మాత్రం నటీమణులని అప్సెట్ చేస్తూ ఉంటాయి. చిత్ర పరిశ్రమలో రూమర్స్ కామన్ అయినప్పటికీ.. హద్దులు దాటేలా ఉండే కొన్ని రూమర్స్ తో సెలెబ్రెటీలకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇలాంటి వార్తల విషయంలో నటి సోనా హైడెన్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శృంగార పాత్రలు, గ్లామర్ రోల్స్ తో సోనా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. 2001 నుంచి ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. నెటిజన్లకు ఓ విన్నపం చేశారు. తాము నటించే సినిమాలపై, పాత్రలపై కామెంట్ చేసే, విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంది. కానీ తమ వ్యక్తిగత జీవితాల గురించి అసత్యాలు ప్రచారం చేసే హక్కు ఎవ్వరికి లేదు అని సోనా అన్నారు.
ముఖ్యంగా నటీమణుల గురించి డర్టీ వార్తలు ప్రచారం చేయొద్దని అన్నారు. సోషల్ మీడియాని మిస్ యూజ్ చేయవద్దని కోరారు. మా గురించి డర్టీగా రాసేముందు ఒకసారి ఆలోచించండి. మీ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు అని అన్నారు. పలానా నటి పడకగదిలో ఉంది.. అలా చేస్తోంది అంటూ చెత్త గాసిప్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దయచేసి అలాంటి అసత్యాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని సోనా నెటిజన్లని కోరారు. సోనా సౌత్ భాషలన్నింటిలో నటించారు. సోనా గ్లామర్ రోల్స్ తో పాటు ఆయుధం, వీడే, ఆంధ్రావాలా లాంటి తెలుగు చిత్రాల్లో మెరిశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com