ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్ సన్నాఫ్ సత్యమూర్తి

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

ప్ర‌తి సంవ‌త్స‌రం యాపిల్ సంస్థ టాలీవుడ్ బెస్ట్ ఆల్బ‌మ్ ను ప్ర‌క‌టిస్తుంటుంది. అలాగే ఈ సంవ‌త్స‌రం కూడా యాపిల్ ఐ ట్యూన్స్ బెస్ట్ ఆల్బ‌మ్ ని ఎనౌన్స్ చేసింది. ఇంత‌కీ ఈ ఇయర్ బెస్ట్ ఆల్బ‌మ్ ఏమిటంటారా..? స‌్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాన్ని బెస్ట్ ఆల్బ‌మ్ గా ప్ర‌క‌టించింది.

అయితే ఇది సేల్స్ ప‌రంగా నిర్ణ‌యించింది కాదు..యూజ‌ర్ల నుంచి ల‌భించిన ఆద‌ర‌ణ బ‌ట్టి ఈ ఇయ‌ర్ బెస్ట్ గా నిర్ణ‌యించార‌ట‌. ఈ సినిమా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ప్ప‌టికీ క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు...త్రివిక్ర‌మ్ నుంచి ఇలాంటి సినిమా వ‌స్తుందనుకోలేదు..ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అలాంటిది స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఈ సంవత్స‌రం బెస్ట్ ఆడియో ఆల్బ‌మ్ గా నిలిచిందంటే దేవిశ్రీప్ర‌సాద్ ని అభినందించాల్సిందే. యాపిల్ సంస్ధ ఈ ఇయ‌ర్ బెస్ట్ ఆల్బ‌మ్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి అని ప్ర‌క‌టించ‌డం పై దేవిశ్రీప్ర‌సాద్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఇప్పుడే యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వ‌చ్చింది. ఈ ఇయ‌ర్ బెస్ట్ ఆల్బమ్ గా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

More News

ఈ ఇయర్ ఫేస్ బుక్ హీరో..

ఫేస్ బుక్...చూస్తే చాలు...ఎక్కువుగా ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారో...ఇట్టే తెలిసిపోతుంది.అది రాజకీయం కావచ్చు..

సింగం 3 లో శ్రుతి హాసన్ పాత్ర ఇదే..

సూర్య హీరోగా హరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సింగం 3.సూర్య నటించిన సింగం 1,సింగం 2ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో సింగం 3 పై మంచి క్రేజ్ ఏర్పడింది.

వంశీ మ్యూజిక్ తో... ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ

మహదేవ్,ఐశ్వర్య,సిరిశ్రీ,పునర్ణవి ప్రధాన పాత్రల్లో చందు ముద్దు తెరకెక్కించిన చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ.ఈ చిత్రాన్నిపి.ఎస్.సూర్య తేజా రెడ్డి నిర్మించారు.

టఫ్ రోల్ చేస్తున్నానంటున్న తాప్సీ..

ఝుమ్మంది నాదం,మిస్టర్ పర్ ఫెక్ట్,మొగుడు,గుండెల్లో గోదావరి...తదితర చిత్రాల్లో నటించిన అందాల తార తాప్సీ.ఈమధ్య అవకాశాలు లేక తెలుగు తెరకు దూరమయ్యింది.

డిసెంబర్ 25న విడుదలవుతున్న 'మామ మంచు..అల్లుడు కంచు'

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు,రమ్యకృష్ణ,మీనా,అల్లరి నరేష్,పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం‘మామ మంచు..అల్లుడు కంచు’.