కారు ప్రమాదానికి గురైన కన్నడ నటుడి తనయుడు.. బైక్ ని తప్పించబోయి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కన్నడ నటుడు, పొలిటీషియన్ అయిన జగ్గేష్ తనయుడు యతి రాజ్ కారు ప్రమాదానికి గురయ్యారు. గురువారం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యతిరాజ్ తన బీఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చిక్బల్లాపురం సమీపంలో యతిరాజ్ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించేబోయే క్రమంలో కారు అదుపు తప్పింది. దీనితో పక్కనే ఉన్న చెట్టుని కారు బలంగా ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు బాగా ధ్వంసం అయింది. కానీ అదృష్టవ శాత్తు యతిరాజ్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
దీనితో ప్రధమ చికిత్స కోసం యతిరాజ్ ని చిక్బల్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగుళూరుకు తీసుకుని వెళ్లారు. ప్రమాద సమయంలో కారులో యతిరాజ్ మాత్రమే ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చిన బైకు వక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ ప్రమాదంపై యతిరాజ్ కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. పోలీసులు ప్రమాద వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యతిరాజ్ తండ్రి జగ్గేష్ కన్నడలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కూడా. ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జగ్గేష్ బీజేపీలో కొనసాగుతున్నారు. యతిరాజ్ తండ్రి బాటలోనే సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే యతిరాజ్ కు అవకాశాలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com