కన్న తల్లి ఎదుటే ఘోరం.. బ్రిడ్జ్‌పై దూకేసిన కొడుకు

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

కారులో కుమారుడితో కలిసి తల్లి ప్రయాణం చేస్తోంది. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ గొడవ కాస్త ముదిరింది. దీంతో తల్లిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కుమారుడు కారులో నుంచి దిగి బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ షాకింగ్ ఘటన చైనాలోని షాంగై బ్రిడ్జ్‌ వద్ద చోటు చేసుకుంది. బుధవారం నాడు ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.

తన కళ్ల ఎదుటే కుమారుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకేయడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరై బ్రిడ్జ్‌పైనే కుప్పకూలిపోయింది!. ఆ తల్లి ఆవేదనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కంటతడిపెడుతున్నారు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సింది.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఘర్షణ పడకుండా కాస్త తగ్గుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని నెటిజన్లు చెబుతున్నారు. సో.. క్షణికావేశంలో.. ముఖ్యంగా గొడవ జరిగిన సమయాల్లో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు.. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగేయాలని నిపుణులు సూచిస్తుంటారు.

More News

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఏపీలో దేవుడికే దిక్కులేదు.. టీటీడీ ఎందుకు స్పందించట్లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో దేవుడికే దిక్కు లేదని.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ ఎన్నికల్లో 12 మంది మంత్రులకు ఓటమేనట!

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులే కాదు సీనియర్లు, రాజకీయ ఉద్ధండులు అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు

టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు పిలుపు.. ఏం చేయబోతున్నారో!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మొదలుకుని నేటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున అటు ఈసీ..

'గీతా ఛలో' ఆడియో వేడుక

గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో