తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు..ఎవ‌ర‌నుకుంటున్నారా..? యువ హీరో ఆది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ప‌టాస్ సినిమాలో తండ్రి కొడుకులుగా సాయికుమార్ - క‌ళ్యాణ్ రామ్ న‌టించిన విష‌యం తెలిసిందే. తెలుగులో సూప‌ర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో ఎస్.వి బాబు నిర్మిస్తున్నారు.

తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్ర‌ను క‌న్న‌డ‌లో కూడా సాయికుమారే పోషిస్తున్నారు. అందుచేత క‌ళ్యాణ్ రామ్ పోషించిన పాత్ర‌ను పోషించ‌మ‌ని ఆదిని క‌న్న‌డ నిర్మాత ఎస్.వి.బాబు అడిగార‌ట‌. అయితే ఆది మాత్రం ఇప్పుడు ఆ పాత్ర నేను పోషించ‌డం క‌రెక్ట్ కాదు. అయినా నా దృష్టి అంతా తెలుగు సినిమాల పైనే అంటూ తండ్రి సినిమాలో న‌టించ‌నన్నాడ‌ట త‌న‌యుడు ఆది. అది సంగ‌తి.

More News

చ‌ర‌ణ్ తండ్రిగా న‌టిస్తున్న క‌మెడియ‌న్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సోగ్గాడి డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఇదే

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌.

ప‌ది కాలాల పాటు మ‌ర‌చిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హ‌ను రాఘ‌వ‌పూడి

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ పాట

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.

రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

రవితేజ ఏ ముహుర్తాన తన నెక్ట్స్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాతలు మారుతూనే ఉన్నారు.రవితేజ నిర్మాతగా వేణుశ్రీరాం నిర్మాతగా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.