నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని కలిసిన సోము వీర్రాజు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ మధ్య బీజేపీ నేతలు తమ పార్టీలో సినీ గ్లామర్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో ప్రముఖ నటి కుష్బూను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక తెలంగాణలో సైతం విజయశాంతి సోమవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే జనసేనాని పవన్ సైతం ఆ పార్టీకి బహిరంగ మద్దతును ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నటి హేమ గతంలో వైసీపీలో చేరాలని భావించారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే హేమ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బీజేపీ కూడా సెలబ్రిటీలు తమ పార్టీలో ఉంటే తద్వారా వారి అభిమానులకు గాలం వేయవచ్చని ఆ పార్టీనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments