తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలపై పవన్‌తో సోము వీర్రాజు చర్చ
- IndiaGlitz, [Monday,January 25 2021]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. జనసేన – బీజేపీ కూటమికి చెందిన అభ్యర్థి విజయంపై ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై ముఖ్యంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో పవన్‌ను సోము వీర్రాజు కలిశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉపఎన్నిక, తిరుపతి ఉప ఎన్నిక, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయి. గురించి చర్చ జరిగింది.
ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగానే భావించి విజయానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తూ... ఇందుకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విజయంతో నాంది పలికే విధంగా ఇరుపార్టీల శ్రేణులను సమాయత్తం చేస్తారు. ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్స్ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సమన్వయ లోపం లేకుండా ఇరుపార్టీలు ముందుకు వెళ్లేలా కార్యక్రమాల్ని సిద్ధం చేస్తారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఈ సమావేశంలో పవన్, సోము వీర్రాజు నిర్ణయించారు