లంకా దినకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ గురించి తెలియని వారుండరు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీపై, అటు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడంలో దిట్ట. జాతీయ స్థాయి మీడియాలో ఆయన తరుచూ కనిపిస్తూ ఉంటారు. దీంతో ఆయన నేషనల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు సాధించారు. తాజాగా ఈ అంశమే ఆయనకు పత్రికూలంగా మారింది. లంకా దినకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. దినకర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ సోమూ వీర్రాజు ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందును పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ ఆఫీస్ సెక్రెటరీ శ్రీనివాసరావు పేరుతో లంకా దినకర్‌కు సస్పెన్షన్ లేఖ అందింది.
కాగా.. జూలై 26న జరిగిన మీడియా చర్చలో లంకా దినకర్ పాల్గొన్నందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని బీజేపీ వెల్లడించింది. అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేశామని పార్టీ పేర్కొంది. దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com