ఆ ఎమ్మెల్యే సమ్‌థింగ్ స్పెషల్...

  • IndiaGlitz, [Saturday,November 14 2020]

బిహార్‌కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్ ఆలమ్ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే తరతరాలకు సరిపడా సంపాదించుకునే ఈ రోజుల్లో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా కనీసం సొంత ఇల్లు కూడా ఆయనకు లేకపోవడం విశేషం. కటిహార్ జిల్లా బలరామ్‌పూర్ నియోజకవర్గం నుంచి మహబూబ్ నాల్గవసారి విజయం సాధించారు. నిజమైన ప్రజానేతగా ప్రజల అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో మహబూబ్ గెలుపొందారు.

మహబూబ్ ప్రత్యేకలు చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకునే వెళుతుంటారు. కాగా.. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అయితే మహబూబ్ ఆలమ్ తీరు వీరిందరికన్నా భిన్నమైంది. ఆయన కోట్లకు కోట్లు కూడబెట్టుకోలేదు. కానీ కోట్ల రూపాయల విలువైన ప్రజాభిమానాన్ని మాత్రం పుష్కలంగా సంపాదించుకున్నారు. చెప్పాలంటే మహబూబ్ సమ్ థింగ్ స్పెషల్. అందుకే మహబూబ్ ఆలమ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

మహబూబ్ ఆలమ్ సీపీఐ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో బలరామ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగవసారి విజయం సాధించారు. పోనీ ఆయనేమీ వంద, రెండు వందల మెజారిటీతో విజయం సాధించలేదు. ఏకంగా 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. 44 ఏళ్ల మహబూబ్ ఆలమ్ 10వ తరగతి మాత్రమే చదివారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో తనకు ఆస్తులేమీ లేవని మహబూబ్ ఆలమ్ చెప్పడం విశేషం.

More News

క‌ళ్యాణ్ దేవ్ 'కిన్నెర‌సాని' టైటిట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో

‘ఆహా’ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌

డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను చూర‌గొన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

తెలంగాణలో గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

బాణసంచా వ్యాపారులకు సుప్రీం ఊరట..

తెలంగాణ బాణసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘

వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో  ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే....