వంగవీటి కొన్ని వీడియో షాట్స్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి. బెజవాడ రాజకీయ నాయకుడు వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా ఈ వంగవీటి చిత్రాన్ని వర్మ రూపొందిస్తున్నారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా వంగవీటి ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ...దసరా కానుకగా ఈ చిత్రంలోని కొన్ని వీడియో షాట్లు రిలీజ్ చేసారు.
మ్యాగజైన్స్ లకు కొన్ని ఫోటో స్టిల్స్ ఇచ్చినట్టు ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారిగా కొన్ని వీడియో షాట్లు అంటూ వర్మ ట్వీట్ చేసారు. గ్యాంగ్ స్టర్ మూవీస్ ని తెరకెక్కించడంలో మాస్టర్ అయిన వర్మ మరోసారి ఆడియోన్స్ ను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు అనిపిస్తుంది. రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments