చంద్రబాబు ఫ్యామిలీకి సొంతూరిలోనే షాక్.. భూమి ఆక్రమణకు యత్నం
Send us your feedback to audioarticles@vaarta.com
భూమి విలువ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ భూమి కనిపించినా.. అది ఎవరిదైనా తగ్గేదే లే అంటున్నారు. ఎలాంటి బెరుకు లేకుండా దొంగ పత్రాలు సృష్టించడమో లేదంటే.. భారీ యంత్రాలతో భూముల్లో కంపచెట్లు తొలగించి జెండా పాతేస్తున్నారు. రాత్రికి రాత్రే పలు ప్రాంతాల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయపెడుతున్నారు. వీరిలో పలువురు ప్రముఖులు కూడా వున్నారు.
ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని సర్వే నంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు యత్నించారు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.
1989లో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆస్తి పంపకాల్లో భాగంగా ఆ భూమిని చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు విభజించారు. ఆ తర్వాత తన వాటాగా వచ్చిన భూమిని ఆస్పత్రి, కల్యాణ మండపానికి చంద్రబాబు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు అదే భూమిలో నారా రామ్మూర్తి నాయుడు పేరిట వున్న 38 సెంట్లలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆ భూమికి సంబంధించి రామ్మూర్తి నాయుడు పేరుపై రిజిస్ట్రేషన్ జరిగినా దాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ... దీనిని అదనుగా చేసుకుని కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments