'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' రిలీజ్ ఖ‌రారు

  • IndiaGlitz, [Monday,November 18 2019]

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌'. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేసి మే 1, 2020లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. మ్యూజిక్ సెన్సేస‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సాయితేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్ర‌తిరోజూ పండ‌గే' షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 20న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గానే సాయితేజ్ మ‌రో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేశాడు. 'చిత్ర‌ల‌హ‌రి' త‌ర్వాత స‌బ్జెక్ట్స్ ఎంపిక‌లో అచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్న సాయితేజ్ ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తుండ‌టం విశేషం.