‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ ప్లాన్ అదేనా..?

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో నటించిన యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సోలో బ్రతుకే సో బెటర్’ తుది దశ చిత్రీకరణలో ఉంది. అందులో భాగంగా రామోజీ ఫిలింసిటీలో సాయితేజ‌, న‌భా న‌టేశ్‌ల‌పై శేఖ‌ర్ మాస్ట‌ర్ నేతృత్వంలో పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. నిజానికి క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ మూవీ మే 1కే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.

థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో ఇంకా క్లారిటీ లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు సోలో బ్రతుకే సో బెట‌ర్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. జీ5లో ఈ సినిమా డిజిటల్‌గా ప్ర‌‌సారం అవుతుంద‌ని, శాటిలైట్ హ‌క్కులు కూడా స‌ద‌రు జీ చానెలే ద‌క్కించుకుంద‌ని టాక్‌. డిజిట‌ల్ హ‌క్కుల కోసం రూ.25 కోట్లు ఆఫ‌ర్ ద‌క్కింద‌ని అంటున్నారు. అలాగే దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.