మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ ఇక లేరు..

  • IndiaGlitz, [Friday,April 30 2021]

మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేటి ఉదయం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 91 ఏళ్ల సోలీ సోరాబ్జీ రెండుసార్లు అటార్నీ జనరల్‌గా సేవలందించారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

సోలీ సోరాబ్జీ పూర్తి పేరు సోలి జహంగీర్ సోరాబ్జీ. ఆయన 1930వ సంవత్సరంలో ముంబైలో జన్మించారు. 1953లో ముంబై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసును ప్రారంభించారు. 1971లో సోలీ సోరాబ్జీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1997లో మానవ హక్కుల పరిస్థితిలై అధ్యయనం కోసం ఐక్యరాజ్యసమితి ఆయనను ప్రతినిధిగా పంపించింది.

అనంతరం సోలీ సొరాబ్జీ ఐక్యరాజ్య సమితి ‘ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించారు. 1998-2004 మధ్య ఐక్యరాజ్య సమితి నియమించిన ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఉప సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ది హేగ్‌లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో 2000-2006 మధ్య శాశ్వత సభ్యుడిగా కూడా కొనసాగారు. సోలీ సొరాబ్జీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More News

బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్

ప్రముఖ నటుడు సిద్దార్థ్‌కు తమిళనాడుకు చెందిన బీజేపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతి

ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఆయనకు గుండెపోటు రావడంతో క‌న్నుమూశారు.

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమ ఫలితాన్నిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కూకట్‌పల్లి ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు..

ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది.