నాగ్ మూవీ టైటిల్ సోక్కాలి మైనర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ్ మూవీ టైటిల్ సోక్కాలి మైనర్...! ఇదేం టైటిల్..? ఇంతకీ ఏ సినిమా కోసం అనుకుంటున్నారా..? నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సంచలన చిత్రం గత సంవత్సం సంక్రాంతికి రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ్ లో డబ్ చేస్తున్నారు. తమిళ వెర్షెన్ కి సోక్కాలి మైనర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇటీవల ఊపిరి సినిమాతో తమిళ్ లో కూడా సక్సెస్ సాధించిన నాగార్జున తాజాగా సోక్కాలి మైనర్ సినిమాతో తమిళ ప్రేక్షకుల అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే సోక్కాలి మైనర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక నాగార్జున నటించిన తాజా చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments