మైక్ మూవీస్, సొహైల్ కాంబోలో సినిమా.. హీరోయిన్‌గా...
Send us your feedback to audioarticles@vaarta.com
‘బిగ్‌బాస్’ ఫేం సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘బిగ్‌బాస్’లో సొహైల్ ఆట తీరు అభిమానులను విపరీతంగా సంపాదించి పెట్టింది. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్‌కు బయటకు వచ్చిన తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగింది. దీంతో సొహైల్‌తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో సొహైల్‌కు జోడిగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నాయిక రూప కొడువయూర్ నటిస్తోంది. హోలీ పండగ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇటీవలే మైక్ మూవీస్, సొహైల్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇవాళ్టి సొసైటీలో ఓ బర్నింగ్ ఇష్యూను కథలో చూపించబోతున్నారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని హీరో సొహైల్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపాడు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గతంలో తెలిపారు.
నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. సయ్యద్ సోహైల్ రియాన్, రూప కొడువయూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ అందిస్తుండగా.. ఈ చిత్రానికి ఆర్ట్: గాంధీ నడికుడికార్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com