మైక్ మూవీస్, సొహైల్ కాంబోలో సినిమా.. హీరోయిన్‌గా...

  • IndiaGlitz, [Monday,March 29 2021]

‘బిగ్‌బాస్’ ఫేం సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘బిగ్‌బాస్’లో సొహైల్ ఆట తీరు అభిమానులను విపరీతంగా సంపాదించి పెట్టింది. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్‌కు బయటకు వచ్చిన తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగింది. దీంతో సొహైల్‌తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో సొహైల్‌కు జోడిగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నాయిక రూప కొడువయూర్ నటిస్తోంది. హోలీ పండగ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇటీవలే మైక్ మూవీస్, సొహైల్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇవాళ్టి సొసైటీలో ఓ బర్నింగ్ ఇష్యూను కథలో చూపించబోతున్నారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని హీరో సొహైల్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపాడు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గతంలో తెలిపారు.

నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. సయ్యద్ సోహైల్ రియాన్, రూప కొడువయూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ అందిస్తుండగా.. ఈ చిత్రానికి ఆర్ట్: గాంధీ నడికుడికార్ అందిస్తున్నారు.

More News

‘ఎవర్‌ గివెన్’ నౌక విషయంలో గుడ్ న్యూస్..

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ నౌక ‘ఎంవీ ఎవర్‌ గివెన్ విషయంలో ఓ గుడ్ న్యూస్ తాజాగా వినవస్తోంది.

రోజాకు రెండు మేజర్ సర్జరీలు : వెల్లడించిన సెల్వమణి

నగరి ఎమ్మెల్యే రోజాకు సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ఆమె ఒకటి కాదు రెండు అది కూడా మేజర్ సర్జరీలు చేయించుకున్నారని ఆమె భర్త సెల్వమణి

లగ్జరీ కారు కొన్న ప్రభాస్.. దాని ధర ఎంతో తెలిస్తే...

‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యారు.

తెలంగాణ మంత్రి మిస్సింగ్.. ఎక్కడికి వెళుతున్నారనేది సస్పెన్స్!

సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రి ఒకరు తప్పిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఏంటనేది మాత్రం సస్పెన్స్.

విజయనగరంలో రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి

అతివేగంతో పాటు.. డంపింగ్ యార్డులో చెత్త తగులబెట్టడం వెరసి పెను ప్రమాదానికి కారణమయ్యాయి.