అరియానాకు క్లాస్.. సొహైల్‌కు టాప్ ఫైవ్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘చూస్తున్నా.. చూస్తూనే ఉన్నా..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ముందుగా క్రితం రోజు ఏం జరిగిందో చూశారు. ఎప్పటిలాగే అఖిల్, సొహైల్ మధ్య గొడవ. బట్టల గురించి గొడవ. సొహైల్ బట్టలు అఖిల్ తీసుకున్నాడని ఫన్నీగా చెప్పాడు. ఫన్ కాస్త ఓవర్ అవడంతో అఖిల్ అలగడం.. ఇద్దరి మధ్య ఎప్పటిలాగే చిన్న గొడవ. తరువాత హారిక వెళ్లి అఖిల్‌ని హగ్ చేసుకుని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ మరోసారి గొడవకు దిగారు. వీరి గొడవ ఎప్పుడూ ఉండేదేనని నాగ్ అంతటితో దానిని కట్ చేసి హౌస్‌మేట్స్ ముందుకు వెళ్లారు. వెంటనే టాస్క్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్ ఉన్న బోర్డు పెట్టి.. వారు హౌస్‌లోకి వచ్చినప్పుడు అభిప్రాయం.. 100 రోజుల తర్వాత ఇప్పటి అభిప్రాయం అడిగారు. మొదట హారిక.. అఖిల్ గురించి టాట్యూ చూడగానే ఓహో అనిపించిందని చెప్పింది. ఇప్పుడైతే క్యూటీ పై అని చెప్పింది. అభి స్టార్టింగ్ సైలెంట్ అని.. ఇప్పుడు అస్సలు సైలెంట్ కాదని.. ఇన్నోసెంట్ ఏమీ కాదని చెప్పింది. లోపల చాలా మాస్ అని.. బయటకు క్లాస్ అని హారిక చెప్పింది. మోనాల్.. స్టార్టింగ్ బాగా కనెక్ట్ అయిందని.. ఇప్పుడు ఎల్డర్ సిస్టర్‌లా అయిపోయిందని చెప్పింది. అరియానా.. టాస్క్.. రిలేషన్‌కి మధ్య వ్యత్యాసం చూపిస్తుందని చెప్పింది. సొహైల్ అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉన్నాడని చెప్పింది.
అఖిల్.. హారిక ఫస్ట్ చూసినప్పుడు చాలా యాటిట్యూడ్‌తో ఉండేదనిపించిందని.. అందుకే లైట్ తీసుకున్నానని.. ఇప్పుడైతే సో క్యూట్ అని చెప్పాడు. మోనాల్‌ను చూసినప్పుడు పట్టించుకోలేదని.. ఇప్పుడు తను చాలా నైస్ అని చెప్పాడు. సొహైల్ మొదట్లో ఆగఆగమాగమయ్యాడని.. ఇప్పుడు పాయింట్ చక్కగా మాట్లాతాడని చెప్పాడు. అరియానాను మొదట చూసినప్పుడు కాస్త భయం వేసిందని చెప్పాడు. ఇప్పటికి కూడా కాస్త అలాగే ఉందని చెప్పాడు. అభిని మొదట చూసినప్పుడు తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అవుతాడని అనుకున్నానని చెప్పాడు. ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చిందన్నట్టుగా చెప్పాడు. అభి.. అరియానా.. రాగానే ఏంటి ఇలా బిహేవ్ చేస్తుందని అనిపించింది. సొహైల్ స్వీట్ గై అని.. కానీ కోపం ఎక్కువని చెప్పాడు. హారిక అన్నీ హానెస్ట్ అని చెప్పాడు. తను చాలా కూల్.. రిలాక్స్‌డ్ అనుకున్నానని ఇప్పుడు కాదని చెప్పాడు. మోనాల్.. హైపర్ అనిపించిందని.. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నానని చెప్పాడు. అఖిల్.. మోనాల్ లింక్ కారణంగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పాడు. తను లేకుంటే మేము చాలా గుడ్ ఫ్రెండ్స్ అయి ఉండేవారమని చెప్పాడు. అఖిల్, మోనాల్‌తో ఇప్పుడు నీ రేపో ఎలా ఉందని నాగ్ అడిగితే.. గుజరాత్ వెళ్దామనుకుంటున్నానని చెప్పాడు. అఖిల్ గురించి బయటకెళ్లాక తెలుసుకుంటుందామనుకున్నానని చెప్పాడు. తరువాత మోనాల్.. అఖిల్ ఇన్‌స్టా గ్రాం ప్రొఫైల్ చెక్ చేశానని చెప్పింది. లాస్ట్ ఇంప్రెషన్ సూపర్ అని చెప్పాడు. హారిక ఫస్ట్ ఇంప్రెషన్ వావ్ అనిపించింది. ఇప్పుడైతే తను నా చెల్లి అనిపించింది. సొహైల్ మొదట అస్సలు నచ్చలేదని.. ఇప్పుడు చాలా కనెక్ట్ అయ్యాడని.. తనకు ఒక బ్రదర్ అని చెప్పింది. అరియానా.. ఫస్ట్ డే నుంచి అర్థమవ్వడం లేదని చెప్పింది. అభితో మొదట మంచి రేపో ఉందని.. తరువాత డిస్టెన్స్ పెరిగిందని చెప్పింది.
అరియానా.. ఫస్ట్ అభిని చూస్తే మిస్టర్ కూల్ అనిపించిందని.. ఇప్పుడు కూడా అదే అభిప్రాయముందని చెప్పింది. హారికతో అంత రేపో లేదని.. తరువాత ఇద్దరికీ కనెక్ట్ అయిందని చెప్పింది. మోనాల్.. మొదట త్వరగా జడ్జిమెంట్ అనిపించిందని.. ఇప్పుడు బాగా కనెక్ట్ అయిందని చెప్పింది. అఖిల్‌తో పర్సనల్‌గా ఎప్పుడూ కనెక్ట్ అవలేదని.. కానీ మంచి రాపో ఉందని చెప్పింది. సొహైల్‌తో మా కమ్యునికేషన్ సెట్ అవట్లేదనిపించిందని.. ఇప్పటికీ సెట్ అవ్వట్లేదని చెప్పింది. సొహైల్, నీకు మధ్య ఏం జరిగిందని నాగ్ అడిగారు. టాస్క్‌లో ఎన్ని ఎమోజీస్ ఉన్నాయని నాగ్ అడిగారు. అగ్రెసివ్ ఎందుకు ట్రై చేశావని నాగ్ అడిగారు. సొహైల్‌కి కోపం ఎక్కువని తెలుసని దానిని ఎందుకు టచ్ చేశావని అడిగారు. మొదట నేనే హై పిచ్ రేజ్ చేశానని అరియానా చెప్పింది. ఆ రోజు ఏం జరిగిందో అఖిల్ చెప్పాడు. అభి కూడా తన వర్షన్ చెప్పాడు. సొహైల్‌ని కోపం రాకుండా పర్‌ఫెక్ట్‌గా టాస్క్ ఆడావు కానీ టాస్క్ అయిపోగానే ఎందుకు రేజ్ అయ్యావని నాగ్ అడిగారు. నీ దగ్గరకు సొహైల్ వచ్చాడా? అని అరియానాను నాగ్ అడిగారు. అయితే గొడవ కోసమే వచ్చాడని చెప్పింది. నువ్వు చెప్పిన ప్రతి మాట కోపం లేకుండా చెప్పుంటే అన్నీ వాలిడ్ అని చెప్పారు.
అంతా అయిపోయాక వాష్ రూమ్ దగ్గర ఏడవడం ఉమెన్ కార్డు తీయడం కరెక్ట్ కాదని నాగ్ చెప్పారు. ఈ హౌస్‌లో జెండర్ డిఫరెన్స్ లేదని నాగ్ చెప్పారు. చాలా హిస్టీరికల్‌గా బిహేవ్ చేశావని క్లాస్ పీకారు. మోనాల్ ఏడుస్తుంటే బయటకు వచ్చేశావని.. కనీసం ఓదార్చేందుకు కూడా ట్రై చేయలేదని చెప్పారు. సొహైల్ బ్యాడ్ లాంగ్వేజ్ వాడాడా? అని అడిగారు. అదేమీ లేదని అరియానా చెప్పింది. అరియానా అంత రియాక్షన్ అవడం అవసరం లేదని అభి చెప్పాడు. అఖిల్.. కూడా ఉమన్ కార్డు నా దగ్గరే తీసిందని.. సొహైల్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగానే ఏడవడం స్టార్ట్ చేసిందని ఇన్‌టెన్షన్‌గా తీసిందని చెప్పాడు. ఇద్దరినీ నాగ్ కన్విన్స్ చేశారు. అఖిల్.. మొదట యాటిట్యూడ్ అనిపించిందని.. ఇప్పుడు ఏదైనా అయితే మంచి స్టాండ్ తీసుకుంటాడని చెప్పాడు. తరువాత అభి.. మొదట అమాయకుడు అనుకున్నానని.. చాలా షార్ప్ అని చెప్పాడు. అభిని పిల్లలెలా పుడతారని నాగ్ అడిగారు. తరువాత ఆయనే పిల్లలు ఏడుస్తూ పుడతారని చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. నిన్నటి టాస్క్‌లో మోనాల్ స్టార్టింగ్ యాటిట్యూడ్ అనుకున్నానని.. ఇప్పుడు స్వీటెస్ట్ సిస్టర్ అని చెప్పాడు. హారిక.. స్టార్టింగ్ నుంచి మంచి ఒపీనియన్ ఉందని చెప్పాడు. అరియానాలో కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువని చెప్పాడు. ఈ వారం ఎవ్వరినీ సేఫ్ చెయ్యడం లేదని నాగ్ చెప్పారు. ఫినాలేకు వెళ్లే కంటెస్టెంట్‌లను రివీల్ చేసుకుంటూ వెళదామని చెప్పారు. నీ లెక్క ప్రకారం.. నీ తర్వాత నలుగురు ఫైనలిస్ట్‌లు ఎవరనుకుంటున్నావని అఖిల్‌ని నాగ్ అడిగారు. సొహైల్, మోనాల్, అభి, హారిక పేర్లు అఖిల్ చెప్పాడు. ఫైనలిస్ట్స్ నేమ్స్‌లో ఫస్ట్ సొహైల్ పేరు వచ్చింది. మొత్తానికి ఫ్రెండ్స్ ఇద్దరూ టాప్ ఫైవ్ ఫైనలిస్టుల లిస్టులో చేరిపోయారు. అరియానాకు కూడా సొహైల్ సారీ చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com