హారిక, అఖిల్‌లపై సొహైల్ ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘గాజువాక పిల్ల’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అరియానా తన లైఫ్ గురించి కెమెరాకు చెబుతోంది. తన ఫస్ట్ శాలరీ 4 వేలు అని చెప్పింది. ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్ కావాలని ఉందని అరియానా చెప్పింది. అఖిల్, సొహైల్ కలిసి హారికను ఆట పట్టించడం స్టార్ట్ చేశారు. అఖిల్ వెళ్లి హారిక పక్కన కూర్చున్నాడు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. తరువాత ఆఖరి నామినేషన్స్ ప్రారంభమవుతున్నాయని బిగ్‌బాస్ చెప్పారు. అఖిల్ మినహా ఇంటి సభ్యులందరినీ బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశారు. ఒక్కొక్కరికీ సమయానుసారం అవకాశం కల్పిస్తామని.. ప్రేక్షకులను మెప్పించాలని బిగ్‌బాస్ చెప్పారు. మొదటి టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కింగ్ ఆర్ క్వీన్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. బజర్ మోగగానే ఎవరైతే ముందుగా వెళ్లి క్రౌన్‌ను దక్కించుకుంటారో వారు రూలర్ అవుతారు. రూలర్‌కి అఖిల్ మంత్రిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొదట సొహైల్ రూలర్ అయ్యాడు. ముందుగా అంతా తనకు స్వాగతం పలకాలని రూలర్ సొహైల్ ఆదేశించాడు. ముందుగా అరియానాకు గిన్నెలన్నీ తోమాలని చెప్పాడు. నెక్ట్స్ నేను కూడా రాణి అవుతానని చెప్పింది. ఇప్పుడు నువ్వు నాకు అంట్లే ఇచ్చావు రాజా.. తరువాత నేను టైల్స్ ఇస్తాగా తోమడానికి అని రూలర్ సొహైల్ చెప్పాడు.
రాజు గారికి భయమేస్తోందని తన గురించి తనే బిగ్‌బాస్‌కి చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. టమాట మొహంపై పిండుకోమంటే అరియానా చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మొత్తం మీద సొహైల్ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాడు. తరువాత అభిజిత్ రాజు అయ్యాడు. హారికను పిలిచి నేను రాజుగా ఉన్నంతసేపూ ప్రతి పదానికి ముందు వెనకాల ఇకిలి పికిలి అనాలని చెప్పాడు. తరువాత సొహైల్, అరియానాలతో ఒక లవ్ సాంగ్‌కి డ్యాన్స్ చేయించాడు. తరువాత అభి.. క్రౌన్‌ని హారికకు ఇచ్చాడు. హారిక రాణికి సొహైల్ ముద్దు పెడితే.. నాకు పెడతావా.. లేదా? అంటూ అఖిల్ కాసేపు ఫన్ చేశాడు. అభి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారని రాణికి చెప్పాడు. తరువాత రాణి అదంతా అబద్ధమని చెప్పాడు. రాణి అభి బట్టలు తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో వేసింది. 15 సెకన్లలో లేస్ ఉన్న షూస్ వేసుకుని రావాలని సొహైల్‌కి చెప్పింది. రాను.. నా బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో వేసుకోమని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే సొహైల్ కాస్త సీరియస్ అయ్యాడు. సొహైల్‌ని ఆ షూ లేస్.. ఈ షూ లేస్ టై చేసి డ్యాన్స్ చేయమని చెప్పాడు. డ్యాన్స్ చేసి వచ్చి సొహైల్ బాగా ఫైర్ అయ్యాడు.
నేను రాజుగా ఉన్నప్పుడు నేను చెప్తే అది మంత్రి చెయ్యలేదని.. హారిక ఏది చెబితే అది చేస్తున్నాడని సొహైల్ సీరియస్ అయ్యాడు. నేను బట్టలు పడేయమంటే పడేయనని చెప్పానని.. గుడ్డు కొట్టమంటే అది కూడా కొట్టనని చెప్పానని అఖిల్ క్లియర్‌గా చెప్పాడు. హారిక కూడా బట్టలు తనే పడేశానని.. అఖిల్ పడేయలేదని చెప్పింది. టాస్క్‌లో భాగంగా చేసిన దానికి కూడా సొహైల్ బాగా ఫీలవడం అంతగా ఫీలవడం ఏంటో తెలియలేదు. ఇవాళ మరోసారి సొహైల్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్ బయటకు వచ్చాడు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కాదని సొహైల్ ఫీలయ్యాడు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని బిగ్‌బాసే చెప్పారు కాబట్టి లైట్ తీసుకుంటున్నట్టు హారిక చెప్పింది. అభి సీరియస్‌గా వచ్చి ఏమాత్రం రెస్పాండ్ అవకుండా స్విమ్మింగ్ పూల్‌లోని బట్టలు తీసుకెళ్లాడు. ఎందుకో సొహైల్ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడని అనిపించింది. టాస్క్ పెద్దగా ఆకట్టుకుంటున్నట్టైతే అనిపించలేదు. ఏదో కంటెస్టెంట్స్ కష్టపడుతున్నారు ప్రేక్షకుల్ని మెప్పించడానికి. రేపు కూడా ఈ టాస్క్ కొనసాగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com