శ్రీహాన్ - సిరిల మధ్య చిచ్చుపెట్టిన సొహైల్... ఫ్యామిలీ మెంబర్స్, మాజీ కంటెస్టెంట్స్ రాకతో జోష్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంటి సభ్యుల కలయికతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో కొత్త జోష్ వచ్చింది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే గ్రాండ్ ఫినాలేకే సమయం దగ్గర పడుతూ వుండటంతో నాగార్జున క్లాసులు తీసుకోవడం ఆపేసినట్లు కనిపిస్తోంది. వారి ఉత్సాహన్ని కంటిన్యూ చేసేందుకు గాను కొత్త ప్లాన్ వుందని చెప్పారు నాగ్. దీనిలో భాగంగా ఈరోజు హౌస్‌మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు చాలా మంది స్పెషల్ గెస్ట్‌లు సందడి చేశారు.
తొలుత బిగ్‌బాస్ 4 స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోహైల్ ఇనయా కోసం చవ్చాడు. ఆయన స్టేజ్‌పై అడుగుపెట్టగానే ఇనయా కేకలు వేసింది. అంతేకాదు... వీరిద్దరి మధ్య వున్న క్రష్ బయట పడింది. గతేడాది నుంచి అతనిని ఫాలో అవుతున్నానని, సొహైల్ కోసం మణికొండకు షిఫ్ట్ అయి, అతని కోసం జిమ్‌లో చేరితే అక్కడ ఇద్దరు అమ్మాయిలతో కలిసి జిమ్ చేస్తూ కనిపించాడని.. దీంతో తన గుండె ముక్కలైనట్లు ఇనయా తెలిపింది. సొహైల్‌తో పాటు ఇనయా తమ్ముడు కూడా స్టేజ్‌పైకి వచ్చి అక్కను పలకరించడమే కాకుండా ఆమె పర్ఫార్మెన్స్‌కు 9 మార్కులు ఇచ్చాడు. ఇంటిలో ఇనయాకు రేవంత్ కాంపిటేటర్ అని, ఆదిరెడ్డికి అంత సీన్ లేదన్నాడు ఇనయా తమ్ముడు.
ఇదే సమయంలో శ్రీహాన్, సిరిల మధ్య మంటపెట్టాడు సోహైల్. శ్రీహాన్ బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడని, ఆ మధ్య కూకట్‌పల్లిలో ఓ కాఫీ షాప్‌లో అమ్మాయితో చూశానని బాంబు పేల్చాడు. సిరితోనే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలో చూశానని చెప్పాడు. ఆ మాటలతో శ్రీహాన్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఎలాంటి సంబంధం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. షూటింగ్ కోసమే కలిశామని, తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. అయితే సొహైల్ ఏ మాత్రం తగ్గకుండా పాత విషయాలను కదిలించడంతో ఏ క్వశ్చన్‌కి ఏ ఆన్సర్ ఇవ్వాలో తెలియక కంగారు పడ్డాడు. సిరి గతంలో బిగ్‌బాస్ హౌస్‌లో వుండగా.. శ్రీహాన్ ఓ అమ్మాయితో టూర్‌కి వెళ్లాడని చెప్పాడు సొహైల్ . మొత్తంగా సొహైల్ వచ్చి సాఫీగా సాగిపోతున్న శ్రీహాన్ లవ్ లైఫ్‌లో చిచ్చుపెట్టినట్లయ్యింది. మరి దీనిపై రేపటి రోజున శ్రీహాన్- సిరిల మధ్య ఎలాంటి గొడవ అవుతుందో చూడాలి.
ఆ కాసేపటికీ శ్రీహాన్ కోసం ఆయన తండ్రి, నటుడు శివబాలాజీ స్టేజ్ మీదకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీహాన్, సిరిల లవ్ ట్రాక్ గురించి శివబాలాజీ మొత్తం బయటకు లాగాడు. ఇక హౌస్‌లో శ్రీహాన్‌కి రేవంతే కాంపిటేటర్ అని చెప్పాడు శివబాలాజీ. అలాగే అతని పర్ఫార్మెన్స్‌కి 9 మార్కులే ఇచ్చాడు. అనంతరం ఫైమా కోసం జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, ఆమె అక్క వచ్చింది. చాలా రోజుల తర్వాత అక్కాచెల్లెళ్లు ఒకరినొకరు చూసుకోవడంతో ఇద్దరూ కంటతడిపెట్టారు. తర్వాత బుల్లెట్ భాస్కర్ తనదైన పంచ్‌లతో కలిసి నవ్వులు పూయించారు. ఫైమాకి ఇనయానే కాంపిటేటర్ అని, శ్రీసత్యకి అంత సీన్ లేదన్నాడు. అలాగే ఫైమాకి పదికి పది మార్కులు వేశాడు.
వీరు స్టేజ్‌ను వీడాకా.. రేవంత్ కోసం అతని సోదరుడు, రోల్ రైడా వచ్చారు. బాహుబలిలా వున్న రేవంత్ అన్నను చూసిన నాగ్ ఆశ్చర్చం వ్యక్తం చేశారు. నువ్వు లోపలుండుంటే వాళ్లంతా ఏమైపోయేవారోనని కామెంట్ చేశారు. అనంతరం తన తమ్ముడికి శ్రీహాన్‌తోనే పోటీ అని, రోహిత్ లెక్కేకాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి సోదరుడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చారు. రోహిత్‌కి రేవంత్‌తోనే పోటీ అని, రాజ్ పోటీయే కాదన్నారు ప్రభాకర్. తర్వాత ఆదిరెడ్డి కోసం అతని సోదరి నాగలక్ష్మీ, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ లహరి వచ్చారు. అంధురాలైన చెల్లెలిని చూడగానే ఆదిరెడ్డి కంటతడి పెట్టాడు. తాను పని పాటా చేయని సమయంలో చెల్లికొచ్చే పెన్షన్‌తోనే ఐదేళ్లు బతికామని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అన్నయ్యకి రేవంత్‌తోనే కాంపిటేషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని నాగలక్ష్మీ చెప్పింది.
అనంతరం శ్రీసత్య కోసం ఆమె ఫ్రెండ్ హారిక, బుల్లితెర నటి విష్ణు ప్రియలు స్టేజ్ మీదకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీసత్య రేవంత్‌తోనే పోటీ అని.. కీర్తి పోటీయే కాదని చెప్పారు తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయి రోనక్‌లు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అని, ఇనయా కాదని చెప్పారు. కీర్తి భట్ కోసం ప్రియాంక, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వితికా షెరు వచ్చారు. ఈ సందర్భంగా కీర్తికి వీరిద్దరూ ధైర్యం నూరిపోశారు. ఆమెకు శ్రీహాన్‌తోనే పోటీ అని, శ్రీసత్య కాదని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments