'సొగ్గాడే చిన్ని నాయనా' థియేటర్ ట్రైలర్ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజులు తర్వాత నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్... సొగ్గాడే చిన్ని నాయనా థియేటరికల్ ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు.
సొగ్గాడే చిన్ని నాయనే...అనే పాత పాటతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. రమ్యక్రిష్ణ నాగ్ తో...నీలా అవ్వకూడదనే జాగ్రత్తగా పెంచానంటుంది. మరో వైపు లావణ్య త్రిపాఠితో పిట్ట పిటపిటలాడిపోతుంది అంటే..దాని అర్ధం కోసం గూగుల్ లో వెతుకుతుంటాడు మరో నాగ్. అది చూసిన నాగ్ నా కొడుకుగా ఎలా పుట్టావ్ రా అంటాడు. ఇంతలో...శివుడు గుడి...సర్ ఫ్రజ్ చేస్తూ... స్నేక్...ఫైనల్ గా నా ఫ్యామిలీ జోళికి వస్తే...వాసివాడి తస్సాదీయ్యా అంటూ ఫైట్ చేస్తున్నాడు నాగ్. ఇదంతా చూస్తుంటే...ఈ సంక్రాంతికి సొగ్గాడుగా నాగ్ అదరగొట్టడం...బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ టు నాగ్ టీమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com