సీక్వెల్ ప్లాన్ లో నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంతకీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నాగ్ కెరీర్ లోనే ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా సూపర్ కలెక్షన్స్ సాధిస్తుంది.
ఈ సినిమాలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో బంగార్రాజు పాత్రకు కొనసాగింపుగా ఓ కథ రెడీ చేయమని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కి చెప్పారట నాగార్జున. కళ్యాణ్ కృష్ణ... నాగ్ చెప్పినట్టే సీక్వెల్ కి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చే సంక్రాంతికి ఈ సోగ్గాడు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com