సోగ్గాడు..సంక్రాంతికి రావడం ఖాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మించారు. చాలా రోజుల తర్వాత నాగార్జున ద్విపాత్రాభినయం చేయడం...అలాగే హిట్ పెయిర్ నాగార్జున, రమ్యక్రిష్ణ జంటగా నటించడం..మనం తర్వాత అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం కావడంతో...సోగ్గాడు పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.
సంక్రాంతి కానుకగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సోగ్గాడే చిన్న నాయనా ఆడియో ఫంక్షన్ లో నాగార్జున సంక్రాంతికి వస్తున్నాం...హిట్ కొడుతున్నాం...అని చెప్పారు. ఈవారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి... సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అని చిత్రయూనిట్ ఈరోజు కన్ ఫర్మ్ చేసింది. మరి...సంక్రాంతికి వచ్చే సోగ్గాడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments