సోగ్గాడి ఓవర్ సీస్ రికార్డ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సంక్రాంతి రేసులో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా` విన్నర్‌గా నిలిచింది. నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్ళను కలెక్ట్ చేస్తున్న చిత్రంగా నిలిచింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమంటే తొలి దర్శకుడుగా కళ్యాణ్ కృష్ణ కొత్త రికార్డుకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే..`మిర్చి` చిత్రంతో కొరటాల శివ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మిర్చి సినిమా ఓవర్సీస్లో 631 కె. డాలర్స్ ను రాబట్టుకుంది. నూతన దర్శకుడికి ఆ రేంజ్లో ఓవర్సీస్లో కలెక్షన్స్ రావడం అప్పట్లో రికార్డ్ అయింది. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే ఆ రికార్డుని దాటేసింది. 661కె. డాలర్స్ ను కలెక్ట్ చేసి మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వైపు దూసుకెళుతుందట. ఈ రకంగా కొరటాల శివను కళ్యాణ్ కృష్ణ దాటేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com