'మనం' పరువు నిలబెట్టేలా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఉంటుంది - నాగ్

  • IndiaGlitz, [Saturday,December 26 2015]

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య‌త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున న‌టిస్తున్న‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుద‌ల చేసి, తొలి సీడీని నాగార్జున‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా...

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ''దేవుడు నాకు అన్నీ అడ‌క్కుండానే ఇచ్చాడు. వాటిలో అభిమానులు కూడా ఉన్నారు. అన్న‌పూర్ణ సంస్థ త‌ర‌పున మిమ్మ‌ల్ని క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు అవుతుంది. మా బ్యాన‌ర్ లో మ‌నం సినిమాను చేశాం. ఆ సినిమాలో నాన్న‌, నేను అంద‌రం క‌ల‌సి న‌టించాం. మాకు దూర‌మైన నాన్న‌గారు మ‌నం సినిమాతో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యారు. మ‌నం సినిమా త‌ర్వాత ఆ సినిమా పరువు నిల‌బెట్టేలా ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచించి చేసిన సినిమానే 'సోగ్గాడే చిన్ని నాయ‌నా'. నాన్న‌గారు అనురాగం, అత్మీయ‌త‌, అనుబంధాలు, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నం, తియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్న‌పూర్ణ సంస్థ ఎప్పుడూ కొత్త‌వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుంటుంది. మంచి క‌థతో నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే నేను వారికి అండ‌గా ఉంటాను. క‌ళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. చాలా కొత్త డైలాగ్స్ నాతో చెప్పించాడు. ఉయ్యాల జంపాల రామ్మోహ‌న్ గారు ఇచ్చిన క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసి ఈ సినిమా చేశాడు. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నాలుగు మచి సాంగ్స్ ఇచ్చాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం...కొడుతున్నాం'' అన్నారు.

ఎ.నాగ‌సుశీల మాట్లాడుతూ ''త‌మ్ముడుకి సినిమాలో పంచెక‌ట్టుతో డ్యాన్స్ చేయాల‌ని చెబుతుండేదాన్ని ఇప్పుడు ఈ సినిమాలో త‌ను అలా డ్యాన్స్ చేశాడు. తమ్ముడు హ్యండ్ స‌మ్ గా క‌న‌ప‌డుతున్నాడు.యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

అమ‌ల మాట్లాడుతూ ''యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ''నాగార్జున‌ను పంచెక‌ట్టులో చూస్తుంటే ద‌స‌రాబుల్లోడు చిత్రంలో నాగేశ్వ‌ర‌రావుగారిని చూస్తున్న‌ట్లుంది. ఆ సినిమా కంటే సోగ్గాడే చిన్ని నాయ‌నా డ‌బుల్ హిట్ కావాలి అన్నారు.

ర‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ ''బంగార్రాజు, నా క్యారెక్ట‌ర్ అంద‌రికీ న‌చ్చుతాయి. సినిమాలో డైలాగ్స్ ఎంట‌ర్ టైనింగ్‌గా ఉంటాయి. క‌ళ్యాణ్ కృష్ణ ఫ్యూచ‌ర్‌లో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. అంద‌రికీ అభినంద‌న‌లు'' అన్నారు.

అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ''మ‌నం సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. హ‌లోబ్ర‌ద‌ర్‌, నిన్నేపెళ్ళాడ‌తా చిత్రాల నిలిచిపోయే సినిమా అవుతుంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. క‌ళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్'' అన్నారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ''టీజ‌ర్స్‌, సాంగ్స్ బావున్నాయి. నాన్న‌గారు 25 సంవ‌త్స‌రాల క్రితం ఉన్న ఎన‌ర్జీతో న‌టించారు. నాన్న పంచెక‌ట్టులో బావున్నారు. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది'' అన్నారు.

క‌ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ 'అక్కినేని నాగేశ్వ‌రరావుగారి వ‌ల్లే నేను ఈ రోజు ఇక్క‌డ నిల‌డి ఉన్నాను. దేవుడు నాకు నాగార్జున‌గారి రూపంలో క‌న‌ప‌డ్డారు. రామ్మోహ‌న్‌గారి స‌హా ఎంక‌రేజ్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ''అన్నారు.

సుమంత్ మాట్లాడుతూ ''ట్రైల‌ర్ బావుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.

సుశాంత్ మాట్లాడుతూ ''సంక్రాంతికి చిన్న మావ‌య్య సినిమా వ‌చ్చి చాలా కాలం అవుతుంది. సంక్రాంతికి స‌రిప‌డే మూవీ వ‌స్తుంది. సినిమా సాంగ్స్‌, ట్రైల‌ర్స్ చూస్తుంటే హ‌లో బ్ర‌ద‌ర్ గుర్తుకు వ‌స్తుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది'' అన్నారు.

అనూప్ మాట్లాడుతూ 'ఇటీవల మా అమ్మగారు దూరమైయ్యారు. అప్పుడు అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ అందించిన సపోర్ట్ మరచిపోలేం. అందరికీ థాంక్స్'' అన్నారు.

ఈ కార్యక్రమంలో లావణ్యత్రిపాఠి, హంసానందిని, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌ రచన: సత్యానంద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

More News

Vijayakanth's son Shanmuga Pandian is the new ambassador of Chennai

We already know that Chennai Badminton team has been bagged by actor and politician Vijayakanth’s elder son Vijaya Prabakaran and the name of the team which includes some prominent international Badminton players is ‘Chennai Smashers’...

'Bajirao Mastani' set to cross 100 crore by Saturday morning

Team Bajirao Mastani is breaking its own records. The film has now raced past Ram Leela, which had practically the same team of Sanjay Leela Bhansali, Ranveer Singh, Deepika Padukone, Priyanka Chopra and Eros. Released exactly two years back, Ram Leela had scored an opening week of 79.49 crore with a better opening day (15.73 crore) and weekend (51.49 crore). Now, despite massive competition from

Is Shah Rukh Khan again trying to compete with Rajinikanth with G.ONE?

Everybody is aware that Bollywood Superstar Shah Rukh Khan was bowled over with South Superstar Rajinikanth’s spectacular Sci-Fi film ROBOT (ENTHIRAN in Tamil- 2010) and had decided to produce a similar Sc-Fi film, which he did with RA.ONE (2011).

Bollywood actress Evelyn Sharma celebrates Christmas festival for a cause!

Christmas is a festival of ‘giving’ because Lord Jesus Christ throughout his life gave away everything that he had in his life. In fact even when he was crucified on the cross he had no resentment, instead, he prayed to the Almighty for his enemies to forgive them for their ignorance.

Hindu outfits rally behind Simbu in Beep song issue

The Tamil Nadu unit of Siva Sena has supported Silamabrasan in the Beep song issue....