సొగ్గాడు సాంగ్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున నటిస్తూ...నిర్మించిన తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. నాగార్జున చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో ద్విపాత్రభినయం చేయడం విశేషం. సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సొగ్గాడు రెడీ అవుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన సొగ్గాడు పాటలను క్రిస్మెస్ కానుకగా ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అటు క్లాస్..ఇటు మాస్...ఇలా రెండు డిఫరెంట్ రోల్స్ ను నాగ్ ఈ చిత్రంలో పోషించడంతో చిత్ర యూనిట్ సినిమా విజయం పై చాలా నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయట. మరి...సొగ్గాడు..ఏరేంజ్ సక్సెస్ సాధిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com