వందకు పైగా సెంటర్స్ లో సోగ్గాడు అర్థశత దినోత్సవం..

  • IndiaGlitz, [Friday,March 04 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తూ...నిర్మించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సోగ్గాడే చిన్నినాయ‌నా సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా రెండు, మూడు వారాలు ఆడ‌డ‌మే క‌ష్టమైపోతున్న ఈరోజుల్లో ఏకంగా 100 కు పైగా సెంట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అంతే కాదండోయ్...
ఈ సంచ‌ల‌న చిత్రం శాటిలైట్స్ తో క‌లుపుకుని దాదాపు 60 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం విశేషం. దీంతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఏకైక సీనియ‌ర్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున చ‌రిత్ర సృష్టించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో సంచ‌ల‌న చిత్రాల‌ను అందించిన సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున మ‌రిన్ని సంచ‌ల‌న చిత్రాలు అందిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

ప్రయోగానికి రెడీ అవుతున్న యంగ్ హీరో..

ఊహలు గుసగుసలాడే,దిక్కులు చూడకు రామయ్య...చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాగశౌర్య.

18న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి'

గుంటూరు టాకీస్ లో రివాల్వ‌ర్ రాణి ని చూసి షాక్ అవుతారు - హీరోయిన్ శ్ర‌ద్దాదాస్

అధినేత, ఆర్య 2, డార్లింగ్, నాగ‌వ‌ల్లి, మొగుడు, రేయ్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ శ్ర‌ద్దాదాస్. తాజాగా శ్ర‌ద్దాదాస్ గుంటూర్ టాకీస్ సినిమాలో న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది.

మనోజ్ ఎటాక్ వాయిదాకి కారణం ఇదే...

మంచు మనోజ్,సురభి,జగపతిబాబు,ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఎటాక్.

శౌర్య సినిమా చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను - హీరో మంచు మ‌నోజ్

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే...నేను మీకు తెలుసా, ప్ర‌యాణం, వేదం...ఇలా విభిన్న క‌థా చిత్రాలు చేస్తున్నహీరో మంచు మ‌నోజ్. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌.