నేడే సోగ్గాడు శతదినోత్సవం..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున హీరోగా నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు. సంక్రాంతికి కానుకగా రిలీజైన సోగ్గాడు...పోటీ ఉన్నప్పటికీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఎవరూ ఊహించని రికార్డ్స్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు నాగార్జున. ఎంత పెద్ద సినిమా అయినా రెండు - మూడు వారాలు మాత్రమే ఆడుతున్న ఈరోజుల్లో..110 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నాడు సోగ్గాడు.
వైజాగ్ సిటీలో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 5 థియేటర్స్ లో వరుసగా 12 రోజులు ప్రదర్శించిన అన్ని ఆటలు హౌస్ ఫుల్ అయి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాడు నాగార్జున. అలాగే ఉత్తారంథ్రలో 4 కోట్లుకు పైగా షేర్, తూర్పు గోదావరి జిల్లాలో 3 కోట్లకు పైగా షేర్ సాధించి తన స్టామినా ఏమిటో చెప్పకనే చెప్పారు కింగ్ నాగార్జున. డిస్ట్రిక్ రికార్డ్స్ ఇలా ఉంటే... ఎవరు ఊహించని విధంగా సోగ్గాడు 53 కోట్లుకు పైగా షేర్ సాధించి..50 కోట్ల క్లబ్ లో చేరిన వన్ అండ్ ఓన్లీ సీనియర్ హీరోగా నాగార్జున చరిత్ర సృష్టించడం విశేషం. 110 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న సోగ్గాడు విజయవాడ, గుంటూరు, బందరు, ఆదోని సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com