అగష్టులో కామెడి నేపద్యంలో తెరకెక్కుతున్న 'సోడా గోలిసోడా' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.బి ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ పై భువనగిరి సత్య సింధూజ నిర్మాత గా మెట్టమెదటిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉబయగోదావరి జిల్లాల్లో అమలాపురం, పాలకొల్లు లాంటి అందమైన ప్రదేశాల్లో మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మల్లూరి హరిబాబు దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ తారాగాణం తో హస్యప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రంలో ప్రముఖ కమెడియన్స్ ఆలీ, కృష్ణభగవాన్, గౌతంరాజు, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మెహన్, అపూర్వ, జయవాణి లు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ.. ఎస్.బి ఆర్ట్ క్రియెషన్స్ బ్యానర్ లో మెదటిషెడ్యూల్ ని, రెండ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది మా చిత్రం సోడా గోలిసోడా. ఎంత మంచి చిత్రానికైనా కామెడి చాలా అవసరం. అందుకే మా చిత్రంలో వున్న మంచి మెసెజ్ ని చక్కని కామెడి తో చేస్తున్నాం. ప్రముఖ కమెడియన్స్ ఆలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతం రాజు, జబర్దస్త్ ఆది ఇలా చాలా మంది కామెడి చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తారు. మా దర్శకుడు హరిబాబు చాలా క్లారిటితో చేస్తున్న చిత్రం. అగష్టులో మీ ముందుకు చిత్రాన్ని తీసుకురావటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ.. ఎస్.బి.ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ లో నేను చెప్పిన కథ విని సత్య సిందూజ గారు చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. సినిమా అనగానే కమర్షియల్ గా చూసే ఈరోజుల్లో ఈ కథ తెరకెక్కిస్తే పది మంది హయిగా నవ్వుకుంటారు అనే సదుర్దేశంతో నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెదటి రెండు షెడ్యూల్స్ ని పూర్తిచేసుకున్నాం. మిగతా షెడ్యూల్స్ ని ,పాటల చిత్రీకరణ పూర్తిచేసి అగష్టు లో విడుదల కి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా మా కెమెరామెన్ ముజీర్ మాలిక్ గురించి చెప్పాలి. మా విజన్ కి ఆయన అనుభవం తో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా వస్తుంది. చిత్రం చూసిన ప్రతిఓక్కరు కెమెరా వర్క్ గురించి మాట్లాడుకుంటారు. నటించిన అందరూ నటీనటులు చాలా చక్కగా నటిస్తున్నారు, అంతేకాదు కామెడి ముఖ్యం గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు.. మానస్, నిత్యానరేష్, కారుణ్య, ఆలీ, గౌతంరాజు, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మెహన్, షకలక శంకర్, హైపర్ ఆది, తోటపల్లి మధు, జభర్దస్త్ అప్పారావు, జయవాణి, అపూర్వ, మాధవి తదితరులు
సంగీతం.. భరత్, పాటలు.. రెహమాన్, శివనరేష్, మేకప్..మాధవ్, ప్రోడక్షన్ కంట్రోలర్.. రంగా, ఎడిటర్.. నందమూరి హరి, కొ-ప్రోడ్యూసర్.. భువనగిరి శ్రీనివాస మూర్తి, కెమెరా.. ముజీర్ మాలిక్, నిర్మాత.. భువనగిరి సత్య సింధూజ, దర్శకత్వం.. మల్లూరి హరిబాబు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments