రెండవ షెడ్యూల్ 'సోడా గోలిసోడా'
Saturday, June 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.బి ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ పై భువనగిరి సత్య సింధూజ నిర్మాత గా మెట్టమెదటిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉబయగోదావరి జిల్లాల్లో అమలాపురం, పాలకొల్లు లాంటి అందమైన ప్రదేశాల్లో మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ జరుపుకుంటుంది. మల్లూరి హరిబాబు దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ తారాగాణం తో హస్యప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ హౌస్ లో ప్రముఖ కమెడియన్స్ ఆలీ, కృష్ణభగవాన్, గౌతంరాజు, ప్రభాస్ శ్రీను, హీరో మానస్, హీరోయిన్ కారుణ్య లపై కొన్ని కామెడి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయసమావేశంలో నిర్మాత భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ.. ఎస్.బి ఆర్ట్ క్రియెషన్స్ బ్యానర్ లో మెదటిషెడ్యూల్ పూర్తిచేసుకుని రెండ షెడ్యూల్ జరుపుకుంటున్న మా చిత్రం సోడా గోలిసోడా. ఎంత మంచి చిత్రానికైనా కామెడి చాలా అవసరం. అందుకే మా చిత్రంలో వున్న మంచి మెసెజ్ ని చక్కని కామెడి తో చేస్తున్నాం. ప్రముఖ కమెడియన్స్ ఆలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతం రాజు, జబర్దస్త్ ఆది ఇలా చాలా మంది కామెడి చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తారు. మా దర్శకుడు హరిబాబు చాలా క్లారిటితో చేస్తున్న చిత్రం. అతి త్వరలో మీ ముందుకు చిత్రాన్ని తీసుకువస్తాం. అని అన్నారు.
దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ.. ఎస్.బి.ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ లో నేను చెప్పిన కథ విని సత్య సిందూజ గారు చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. సినిమా అనగానే కమర్షియల్ గా చూసే ఈరోజుల్లో ఈ కథ తెరకెక్కిస్తే పది మంది హయిగా నవ్వుకుంటారు అనే సదుర్దేశంతో నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్నాం. రెండవ షెడ్యూల్ జరుగుతుంది. మరో పది రోజుల్లో ఈ షెడ్యూల్ కూడా పూర్తిచేస్తాం. పాటల చిత్రీకరణ చేసి అగష్టు లో విడుదల కి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఓ సినిమా ఆఫీస్ లో హీరో, హీరోయిన్స్ ఇంట్రడక్షన్ ఆలీ గారి కాంబినేషన్ లో తీస్తున్నాం. ముఖ్యంగా మా కెమెరామెన్ ముజీర్ మాలిక్ గురించి చెప్పాలి. మా విజన్ కి ఆయన అనుభవం తో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా వస్తుంది. చిత్రం చూసిన ప్రతిఓక్కరు కెమెరా వర్క్ గురించి మాట్లాడుకుంటారు. అని అన్నారు.
ఆలీ మాట్లాడుతూ.. చాలా యాడ్ ఫిల్మ్ డైరక్ట్ చేసిన హరిబాబు దర్శకుడిగా చేస్తున్నారు. నిర్మాతలు నమ్మి ఈ చిత్రాన్ని చేస్తున్నారు. బీడు భూమిలో కూడా పంటలు పండించవచ్చు అనేది మెయిన్ పాయింట్ గా పూర్తి ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నన్ను, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, ఆది, గౌతంరాజు, జయవాణి, అపూర్వ లాంటి నటీనటులతో పూర్తి కామెడి చిత్రం గా చేస్తున్నారు. అని అన్నారు.
కెమెరామెన్ ముజీర్ మాలిక్ మాట్లాడుతూ.. దర్శకుడు హరిబాబు నేను దాదాపు 18 సంవత్సరాల నుండి స్నేహితులం. ఇప్పడు సినిమా చేస్తున్నాం. ఈ సినిమా చేస్తున్నంతసేపు నవ్వులే నవ్వులు. ఈ సినిమా పేకప్ చెప్పాలంటే భాదగావుంది ఇంటికి వెళ్ళాక బోర్ కొడుతుంది. అంత బాగా చేస్తున్నారు అందరూ.. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అని అన్నారు.
ఈ చిత్రం లో అవకాశం రావటం చాలా అనందంగా వుంది. ఈ మద్య కాలంలో ఫుల్ లెంగ్త్ కామెడి చిత్రంగా తెరకెక్కతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.అని నటీనటులు అన్నారు.
నటీనటులు.. మానస్, నిత్యానరేష్, కారుణ్య, ఆలీ, గౌతంరాజు, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మెహన్, షకలక శంకర్, హైపర్ ఆది, తోటపల్లి మధు, జభర్దస్త్ అప్పారావు, జయవాణి, అపూర్వ, మాధవి తదితరులు
సంగీతం.. భరత్, పాటలు.. రెహమాన్, శివనరేష్, మేకప్..మాధవ్, ప్రోడక్షన్ కంట్రోలర్.. రంగా, ఎడిటర్.. నందమూరి హరి, కొ-ప్రోడ్యూసర్.. భువనగిరి శ్రీనివాస మూర్తి, కెమెరా.. ముజీర్ మాలిక్, నిర్మాత.. భువనగిరి సత్య సింధూజ, దర్శకత్వం.. మల్లూరి హరిబాబు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments