సోడా గోళీసోడా ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ బి ఆర్ట్ క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం సోడా గోలీసోడా ని విజయవంతంగా చిత్రీకరణ పూర్తీ చేసుకుని నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నెల 5 వ తారీఖున రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆడియో విడుదల వీడుక ప్రముఖుల మధ్య అంగరంగవైభవంగా జరుపుకుంది.
నందమూరి హరి కృష్ణ , రాజ్ కందుకూరి, నవీన్ చంద్ర , బెకం వేణుగోపాల్, ప్రసన్న కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన నందమూరి హరి కృష్ణ గారు మొదటి సీడీ ని విడుదల చేసి రాజ్ కందుకూరి గారికి అందించారు. తర్వాత అయన మాట్లాడుతూ "ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. తర్వాత మాట్లాడుతూ సోడా గోలి సోడా టైటిల్ చాల బాగుంది. ఇండస్ట్రీ బాగుండాలి అంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. ఈ సినిమా నిర్మాతలు, సినిమా మీద మక్కువతో సోడా గోలి సోడా చిత్రాన్ని నిర్మించారు. హీరో మానస్ బాలనటుడిగా తన కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో అవార్డు లు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా లో హీరో గ చేస్తున్నాడు. మీరు అందరు మానస్ ని అలాగే హీరోయిన్ నిత్యా ని కూడా ఆశీర్వదించాలి. దర్శకుడు ఒక తండ్రి అయితే నిర్మాత ఒక తల్లి నటీనటులు అందరు వారి పిల్లలు , ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలి అంటే ప్రజలు అందరు వారిని ఆశీర్వదించాలి. ఈ ఆడియో ని సూపర్ హిట్ చేయాలి. ఆడియో సూపర్ హిట్ అయితే సినిమా కూడా సక్సెస్ అవుతుంది".
నవీన్ చంద్ర మాట్లాడుతూ "నా మొదటి సినిమా లో మానస్ విలన్ గ నటించాడు. మానస్ మంచి నటుడు, మంచి గ డాన్సుచేస్తాడు . ఇప్పుడు తన సినిమా సోడా గోలి సోడా ఆడియో విడుదలవుతుంది. మానస్ కి మరియు హీరోయిన్ నిత్యా కి అల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అవాలని కోరుకుంటూ టీం అందరికి అల్ ది బెస్ట్ ".
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " సోడా గోలి సోడా చాల పవర్ఫుల్ టైటిల్, అందరికి తెలిసిన పదం.మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమో మంచి మంచి చిత్రాలు చేసాడు, నంది అవార్డు కూడా సంపాదించుకున్నాడు, ఇప్పుడు హీరో రాణిస్తున్నాడు. నందమూరి హరి కృష్ణ గారు వచ్చి ఆడియో విడుదల చేయడం చాల సంతోషం గా ఉంది. నందమూరి హరి కృష్ణ గారి ఆశీర్వాదం చాల పవర్ ఫుల్ . అయన బ్లెస్సింగ్ తో వారి ఇద్దరు కొడుకులు, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మంచి స్థానం లో ఉన్నారు అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని నేను కోరుకుంటున్నాను .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments