సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన
- IndiaGlitz, [Thursday,January 16 2020]
ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో ముందుకు సాగుతామని అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని స్పష్టం చేశారు పవన్. రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అన్న పవన్... బీజేపీ జనసేన కలిసి ఆ లోటును భర్తీ చేస్తాం అన్నారు. రాష్ట్రంలో వారసత్వ పాలనకు అంతం పలుకుతాం అన్నారు. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ల ప్రభుత్వం నడుస్తోందన్న పవన్.. 2024లో బీజేపి జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా ల క్ష్మీనారాయణ.... మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు ముందుకు రావడం రాష్ట్ర ప్రజలకు శుభ పరిణామం అన్నారు కన్నా. సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అని... చెక్ పెడతామని హెచ్చరించారు. సామాజిక న్యాయం బీజేపీ జనసేన తోనే సాధ్యమని... వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.