ఆర్టిస్టుల మధ్య భౌతిక దూరం కుదరదు : నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్టిస్టుల మధ్య భౌతిక దూరం అంటే కుదరదని.. ఎందుకంటే మేం మాస్క్‌లు పెట్టుకోలేమని అంతేకాకుండా దూరంగా ఉండి రొమాన్స్ సీన్స్‌లో నటించలేమని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు నరేష్ చెప్పుకొచ్చారు. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సినిమా, టెలివిజన్ రంగ ప్రముఖులు ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్ పరిస్థితేంటి..? ఎలా చిత్రీకరణ జరుపుకోవాలి..? సెట్‌లో ఎంతమంది ఉండాలి..? ఎంతసేపు షూటింగ్ చేయాలి..? ఇలా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా నటీనటుల బాధను ప్రభుత్వానికి విన్నవించిన ఆయన.. నిర్మాతలే తమ భద్రతా, బాధ్యతలు చూసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం..!
‘దూరంగా నుంచి లవ్ సీన్స్ చేయలేం. ఎమోషన్ కోసం దగ్గర్నుంచే చేయాలి. టచ్ అప్, మేకప్ బాయ్స్ ఎప్పుడూ మమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటారు. దీనికి కావాల్సిన మెజర్స్ గురించి మాట్లాడటం జరిగింది. అందరికీ ప్రొడ్యూసర్సే మాస్క్‌లు, సూట్‌లు, గ్లౌజ్‌లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే విధంగా సేఫ్టీ ఆఫ్ ది యూనిట్ కొరకు అబ్జవర్స్‌ను కావాలని కోరాం. ప్రతి యూనిట్‌కు ఒక అబ్జవర్‌ను ఏర్పాటు చేయాలని కోరాం. హోం సెక్రటరీగారు తీసుకున్న నిర్ణయాలు చాలా సంతోషించదగ్గవి. తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూనే బాధ్యతలను ఇండస్ట్రీపైనే వదిలింది. షూటింగ్స్ చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ గారికి.. తెలంగాణ ప్రభుత్వానికి మేం ఎంతగానో రుణపడి ఉన్నాం. కళాకారుల పెన్షన్ కోసం లిస్ట్ తయారు చేసి పంపుతాం. అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేసునేదానిపై అదే విధంగా సినిమాను ఏవిధంగా గట్టెక్కించాలనేదానిపై త్వరలోనే హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిశితంగా చర్చిస్తాం’ అని నరేష్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout