Allu Arjun: ఆ యాడ్‌లో చెప్పినదంతా అబద్ధమే ... అల్లు అర్జున్‌పై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా ఎదిగిపోయారు అల్లు అర్జున్. దీంతో ఆయనతో తమ ఉత్పత్తులు ఎండార్స్ చేయించుకోవాలని కార్పోరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. అయితే ఇదే సమయంలో బన్నీ చిక్కుల్లో కూడా పడుతున్నారు. మొన్నామధ్య అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. బన్నీకి, రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉందని.. అలాంటి సంస్థను కించపరచడం సరికాదన్నారు. దీనిపై వివాదం రేగడంతో రాపిడో సంస్థ దిగొచ్చింది.
ఆ ప్రకటనలో వాస్తవం లేదు:
ఇక తాజాగా అల్లు అర్జున్ నటించిన మరో యాడ్ చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించారు బన్నీ. అయితే ఈ ప్రకటనలో ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. పలు వార్త పత్రికల్లో జూన్ 6వ తేదీన వచ్చిన ప్రకటనల్లో పూర్తిగా వాస్తవం లేదని.. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలంటూ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. IIT, NIT ర్యాంకుల విషయంలో తప్పు దోవ పట్టించిన అల్లు అర్జున్, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments