‘మంచి రోజులు వచ్చాయి’ నుంచి 'సోసోగా ఉన్నా' ప్రోమో సాంగ్ విడుదల..

  • IndiaGlitz, [Thursday,August 12 2021]

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్.

ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. తాజాగా ఈ సినిమా నుంచి సోసో గా ఉన్న ప్రోమో సాంగ్ విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ప్రముఖ లిరిక్ రైటర్ కేకే రాసారు. ఆగస్ట్ 16న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా..

More News

5 భాషల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు.

'శ్రీదేవి సోడా సెంటర్' విడుదల తేదీ ఖరారు

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.

'పెళ్లి సంద‌D'... టైటిల్ సాంగ్ విడుద‌ల

``పట్టు చీర‌ల త‌ళ‌త‌ళ‌లు.. ప‌ట్ట గొలుసుల గ‌ళ‌గ‌ళ‌లు

తుదిద‌శ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న అడివి శేష్‌ ‘మేజర్‌’

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నమేజ‌ర్ సినిమా చివ‌రి షెడ్యూల్‌ షూటింగ్ ఈ రోజు (ఆగ‌స్ట్‌12)ప్రారంభ‌మైంది.

'రాజ రాజ చోర‌' .. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.