'స్నేహమేరా జీవితం' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఇది మా అశోక్‌గాడి లవ్‌స్టోరీ` సినిమాతో తెరంగేట్రం చేసి ఆర్య`, సంక్రాంతి`, పోతేపోనీ`, చందమామ`, శంభో శివ శంభో`వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి స్నేహమేరా జీవితం` అనే టైటిల్ ను నిర్ణయించారు. పడ్డానండీ ప్రేమలో మరి`వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 14న శివబాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రంలో శివబాలాజీతో పాటు ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు.
సినిమా మొదటి షెడ్యూల్ పూర్తైంది. సినిమా చాలా బాగా వస్తుంది. సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతం, భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, మాటలు: కిట్టు విస్సా ప్రగడ, కథా విస్తరణ: విద్యాసాగర్ రాచకొండ, పాటలు: బాలాజీ, చైతన్య వర్మ,నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com