ఆస్పత్రి పాలైన స్నేహ‌

  • IndiaGlitz, [Monday,June 03 2019]

స్నేహ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత గా ఆమె అనారోగ్యం పాల‌య్యారు. అందుకే ఆమె ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. 'అటు నువ్వే ఇటు నువ్వే' అనే పాట‌ను హ‌మ్ చేసే వారందరికీ స్నేహ ఉల్లాల్ ప‌రిచ‌య‌మే. ఆ పాట‌లో మాత్ర‌మే కాదు, నంద‌మూరి బాలకృష్ణ న‌టించిన 'సింహా'లోనూ ఆమె మంచి పాత్ర పోషించారు.

ఈ హీరోయిన్ తొలిసారి త‌న జీవితంలో ఆసుప‌త్రి పాల‌య్యారు. దీని గురించి ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్పిట‌ల్‌లో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేసి ''హాస్పిట‌ల్లో ఉండాల్సి వ‌చ్చింది. హై టెంప‌రేచ‌ర్ ఉంది. చాలా బోర్ కొడుతోంది. కాక‌పోతే నెట్‌ఫ్లిక్స్ ఉండ‌టం వ‌ల్ల కాస్త న‌య‌మైంది'' అని కామెంట్ కూడా పెట్టారు. గెట్ వెల్ సూన్ స్నేహ‌.