బాలయ్యతో స్నేహ..?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో ఇద్దరు బాలకృష్ణలు హీరోలుగా నటిస్తారని సోషల్ మీడియాలో ఇది వరకు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ బాలకృష్ణ సరసన స్నేహ హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఇది వరకు వీరి కాంబినేషన్లో పాండురంగడు, మహారథి చిత్రాల్లో బాలయ్య, స్నేహ కలిసి నటించారు. అలాగే ఇందులో ఓ కొత్త హీరో్యిన్ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని ఇటీవల బోయపాటి శ్రీను ఇంటర్వ్యూలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నారని టాక్. ఈ పాత్ర కోసం కాశీ, హిమాలయ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపాలని అనుకున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106 చిత్రమిది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం షూటింగ్‌ను ఆపేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విలన్‌ను కూడా తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే భూమిక లేడీ విలన్‌గా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com