బాల‌య్య‌తో స్నేహ‌..?

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో ఇద్దరు బాల‌కృష్ణ‌లు హీరోలుగా న‌టిస్తార‌ని సోష‌ల్ మీడియాలో ఇది వ‌ర‌కు వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీనియ‌ర్ బాల‌కృష్ణ స‌ర‌స‌న స్నేహ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కు వీరి కాంబినేష‌న్‌లో పాండురంగ‌డు, మ‌హార‌థి చిత్రాల్లో బాల‌య్య‌, స్నేహ క‌లిసి న‌టించారు. అలాగే ఇందులో ఓ కొత్త హీరో్యిన్‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల బోయ‌పాటి శ్రీను ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని టాక్‌. ఈ పాత్ర కోసం కాశీ, హిమాల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని అనుకున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రమిది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌న్‌ను కూడా తీసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. అలాగే భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

More News

ఆ వ్యక్తి కనిపిస్తే దేహశుద్ధి తప్పదు: సింగర్ సునీత

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత చైతన్య అనే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రోసారి సామాజిక బాధ్య‌త‌ను తెలియ‌జేసిన మ‌హేశ్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రంగం అంతా స్తబ్దుగా మారింది. థియేట‌ర్స్  మూత‌ప‌డ్డాయి, సినిమా షూటింగ్స్ ఆగాయి.

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ త‌న‌యుడు మ‌మ్ముటి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన దుల్క‌ర్ సల్మాన్ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

కరోనా విషయమై అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం

రాష్ట్రంలో కరోనా వ్యవహారంపై హైకోర్టులో నేడు కూడా విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ,

భయపడకండి.. ఆగస్ట్ 15కు మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్

ఇది నిజంగా ప్రజానీకానికి గుడ్ న్యూసే.. కరోనా భయంతో అల్లాడుతున్న ప్రజానీకానికి అద్భుతమైన వరం.