మరోసారి తల్లి కాబోతున్న స్నేహ
- IndiaGlitz, [Friday,October 04 2019]
చిలక ముక్కు, చక్కటి నవ్వు, అందమైన మోముతో మన పక్కింటి అమ్మాయిలా పరిచయమైన హీరోయిన్ స్నేహ తనకంటూ గుర్తింపును సంపాదించుకుని తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరం కాలేదు. హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రసన్న, స్నేహలది ప్రేమ వివాహం. చిన్నపాటి గొడవల తర్వాత ఇద్దరూ రెండు కుటుంబాల వారిని ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
వీరికి విహాన్ అనే కొడుకున్నాడు. కాగా.. ఇప్పుడు వీరికి మరో బిడ్డ పుట్టనుంది. రీసెంట్‌గా స్నేహకు చెన్నైలో శ్రీమంతం జరిగింది. ఈ ఫంక్షన్‌కు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారట. స్నేహ నటించిన వినయవిధేయ రామ చిత్రంలో నటించింది. ప్రస్తుతం యాక్టింగ్‌కి కాస్త గ్యాప్ తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ యాక్టింగ్‌పైనే స్నేహ ఫోకస్ పెట్టాలనుకుంటుంది.