ఎస్ ఎన్ ఆర్ట్స్ వారి 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్...
- IndiaGlitz, [Friday,December 29 2017]
ఎస్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' హంట్ అనే కార్యక్రమన్ని ఎస్ ఎన్ చిన్నా మరియు శ్రీధర్ లు త్వరలో ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా నిర్వహించబోతున్నారు. శివశంకర్ మాస్టర్, ఉదయ భాను, ప్రీతి జింగానియాలు 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రాజేష్, ఉల్కా గుప్తా, సాయి వెంకట్, గీత సింగ్, సుమన్ శెట్టి, ఫ్యాషన్ డిజైనర్ అమీర్, జెమిని వెంకట్, సంగీత దర్శకుడు రాజ్ కిరణ్, గురు చరణ్, పాటల రచయిత రామారావు, మురళీ కృష్ణ, రవి కిశోర్, లహరి, శశ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రోగ్రాం డైరెక్టర్ ఎస్ ఎన్ చిన్నా మాట్లాడుతూ.. డిఫరెంట్ క్యాటగిరీస్ ఉన్న టాలెంట్ కలిగిన వారందరిని ప్రోత్సహించడం కోసం చేసే ప్రయత్నమే 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్'. ఈ కార్యక్రమనికి యాంకర్ గా ఉదయభాను, జర్జ్ లుగా శివ శంకర్ మాస్టర్, ప్రీతీ జింగానియా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. రఘువీరా అనే హ్యాండి క్యాప్డ్ ను రైటర్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా పరిచయం చేస్తునందుకు గర్వపడుతున్నాం. ఇక ఈ ఎస్ ఎన్ ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై నేను నా మిత్రుడు రాజేష్ కలసి సినిమా చేస్తున్నా ము. దీనికి సంబంధించిన పాటలు పూర్తయ్యాయి. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాము.. అన్నారు.
శివశంకర్ మాస్టర్ మాట్లాడుతూ.. మల్టీ టాలెంట్ ఉన్న వారందరినీ ఒకే వేదికపై చేర్చడం చాలా సంతోషంగా ఉంది. కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ అన్ని టీవీ షోలకంటే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను.. అన్నారు.
ప్రీతిజింగానియా మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ గా అనిపించింది. ఎన్నో డ్యాన్స్ షోలు వచ్చాయి కానీ ఇటువంటి టాలెంట్ షో ఇప్పటి వరకు రాలేదు. జడ్జ్ గా వ్యవహరించమని అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి షోలకు జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. షో హిట్ అవుతుందని నమ్ముతున్నాను.. అన్నారు.
ఉదయభాను మాట్లాడుతూ.. విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలమని చిన్నా గారితో మాట్లాడిన తర్వాతే అర్థమయ్యింది. సముద్రం లోతంత టాలెంట్ ఉంది. అవకాశం వస్తే నిరూపించుకోవడానికి ఇండియాలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్నీ చిన్నా గారు ఈ షో ద్వారా కల్పిస్తున్నారు. ఇటువంటి గొప్ప షోకు నేను యాంకర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని హిట్ చేసే బాధ్యత కూడా మా అందరిపై ఉందని భావిస్తున్నాను.. అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. చిన్నా చెప్పిన కాన్సెప్ట్ కు రెండు నిమిషాలలో ఒకే చెప్పాను. మాకు మూడు ఆణిముత్యాలు దొరికాయి. ఆ ఆణిముత్యాలే శివశంకర్ మాస్టర్, ప్రీతి జింగానియా, ఉదయభాను. ఈ షో పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు.