సోనూసూద్‌కు చేతులెత్తి నమస్కరించిన స్మృతీ ఇరానీ

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా.. రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు సోనూసూద్ మాత్రం మొదట 1500 పీపీఇ కిట్లు పంజాబ్‌లో డాక్టర్లందరికీ ఇవ్వడం.. ఆ తర్వాత ముంబైలోని తన హోటల్‌ను హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ ఇవ్వడం.. రంజాన్‌ మాసంలో వేలాది మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం లాంటి మంచి పనులు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూసి చలించిన ఆయన.. వారికి నేనున్నా అంటూ అభయమిచ్చి ప్రత్యేక బస్సుల్లో మహారాష్ట్ర నుంచి గుల్బర్గా, కర్నాటక.. ఉత్తరప్రదేశ్ నుంచి లఖ్‌నవో, జార్ఖండ్, బీహార్‌తో పాటు మరికొందర్ని వారి స్వగ్రామాలకు తరలించారు. ఇన్నెన్ని మంచి పనులు చేసిన సోనూసూద్‌కు ఎవరైనా సెల్యూట్ కొట్టక మానరు.

చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఇప్పటికీ ట్విట్టర్‌లో తనను ట్యాగ్ చేస్తూ సాయం కోరితే టీమ్‌తో ముందుకెళ్తున్నారు. సోనూ సేవలను గుర్తించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఎమోషనల్ అయ్యి చేతులెత్తి నమస్కారం చేసేశారు. ‘సోనూ సూద్.. నటనా రంగ సహచరుడిగా మీ గురించి రెండు దశాబ్దాలుగా తెలుసు. అది ఓ గౌరవంగా భావిస్తాను. మీరు నటుడిగా ఎదగడం పట్ల సంతోషించాను. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితులు సవాళ్లు విసురుతున్న సమయంలో మీరు చూపిస్తున్న సానుభూతి నన్ను ఇప్పటికీ గర్వపడేలా చేస్తోంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్న మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను..’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సోనూ సూద్ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

చిరుకు అక్కగా రాములక్క.. జరిగేపనేనా!?

టాలీవుడ్ సీనియర్ నటి కమ్ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

సడన్‌గా చంద్రబాబు విశాఖ టూర్ రద్దు.. ఎందుకంటే..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీకి రావడానికి చాలా రోజుల తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఎట్టకేలకు అనుమతి వచ్చింది.

నాకు ఎప్పటికీ భాయ్ ఫ్రెండ్ ఆయనే..: అనసూయ

జ‌బ‌ర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఇవాళ ఏ రేంజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

వై.ఎస్‌.జ‌గ‌న్‌కు చిరు థాంక్స్‌

క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది. ఈ రంగాన్ని గాడిలో పెట్ట‌డానికి సినీ పెద్ద‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మే 27న 'అమృతం ద్వితీయం'లో లాక్‌డౌన్‌ స్పెషల్స్‌

లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలకు వినోదం అందిస్తున్న ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’. ఫీచర్‌ ఫిల్మ్స్‌ డిజిటల్‌ రిలీజులకు శ్రీకారం చుట్టిందీ సంస్థ. ‘జీ 5’లో ‘అమృతరామమ్‌’ విడుదల చేసిన సంగతి తెలిసిందే.