Smita Sabharwal:కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదు.. స్వితా సభర్వాల్ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వితా సభర్వాల్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా ఆమె పర్యవేక్షించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కీలక సమీక్షలకు హాజరుకావడం లేదు. కనీసం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా రాలేదు. దీంతో స్వితా.. కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఈ క్రమంలోనే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి, కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయ్యిందని ట్వీట్ చేశారు. ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని విమర్శించారు. దేశంలోనే హెలికాఫ్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్పష్టంచేస్తూ ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని ఆమె తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తనదైన ముద్ర వేసేందుకు తన టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ముఖ్యమైన విభాగాలకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సభర్వాల్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout