బాలకృష్ణ 'పైసావసూల్ ' తో చిన్న సినిమా పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం `వెళ్లిపోమాకే`. సుప్రజ, శ్వేత నాయికలు. యాకూబ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. కొత్తవారు చేసిన ఫ్రయత్నాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ సినిమాలో భాగమయ్యాను. ప్రేక్షకులు అదే అనుభూతికి లోనవుతారనే నమ్మకం ఉంది. కొత్తగా సినిమా చేయాలనుకునేవారికి ఇది ఒక లైబ్రరీ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో తీశారు ఈ చిత్రాన్ని.
ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్లు ఉండరు. పక్కింటి అబ్బాయిలు, అమ్మాయిల తరహా పాత్రలే ఉంటాయి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఓ సందర్భంలో ఈ సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు తెలిపారు. సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సెప్టెంబర్ 1న బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన పైసావసూల్ విడుదలవుతుంది. ఓ స్టార్ సినిమాకు పోటీగా చిన్న సినిమా విడుదలవుతుండటం గొప్ప విషయమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com