రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ నూతన దర్శకుడు, నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన `ఇంతలో ఎన్నెన్ని వింతలో` చిత్రం విడుదలకు ముందే క్రేజీ బిజినెస్ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తమిళ రీమేక్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... పెద్ద ప్రొడ్యూసర్ మరియు డిస్ర్టిబ్యూటర్ ఇటీవల సినిమా చూసి, విపరీతంగా సినిమా నచ్చడంతో తామే మూవీ ని రిలీజ్ చేస్తామనీ, తమిళ రీమేక్ రైట్స్ కూడా తమకే ఇవ్వాలన్న కండీషన్ పెట్టినట్లు సమాచారం.
ఈ డీల్ ఓకే అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే అని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తూ...ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. నందు కెరీర్ లో నే `ఇంతలో ఎన్నెన్ని వింతలో` చిత్రం ఘన విజయం సాధిస్తుందని సినిమా చూసిన ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ర్టిబ్యూటర్స్ చెప్పడం విశేషం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com