‘పుష్ప’ షెడ్యూల్ ప్లానింగ్‌లో చిన్న మార్పు

  • IndiaGlitz, [Tuesday,October 27 2020]

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాష‌ల్లో రూపొందుతో్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. ఎక్కువ భాగం చిత్రీకరణ అడవుల్లోనే జరగనుంది. అందుకోసం రాజమండ్రికి సమీపంలో ఉండే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్‌ చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ లాంగ్ షెడ్యూల్ కంటే ముందు వైజాగ్‌లో ఓ చిన్న షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌ను వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తార‌ట‌.

షాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని, త‌న పాత్ర పేరు పుష్ప‌రాజ్ అని స‌మాచారం. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌నుకుంటున్న త‌రుణంలో కోవిడ్ ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగిన సంగ‌తి తెలిసిందే. త‌గు జాగ్ర‌త్త‌ల‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి మేక‌ర్స్ రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం బ‌న్నీగ‌డ్డం ఉన్న లుక్‌లో క‌నిపిస్తున్నారు.

More News

కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా, రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు.

ఓ చిన్నారి కోసం ట్రైన్ ఏకంగా 240 కి.మీ ఆగకుండా ప్రయాణించింది..

కొన్నిసార్లు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు చాలా ఆసక్తికరంగానూ.. చరిత్రలో నిలిచిపోయేవిగానూ ఉంటాయి.

దర్శకధీరుడికి పొలిటికల్‌ హీట్‌

వివాదాలకు దూరంగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పొలిటికల్‌ సెగ తగిలింది. ఈ సమస్యకు కారణం ఆయన దర్శకత్వంలో

దేశంలో 3 నెలల కనిష్టానికి కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 80 లక్షలకు చేరువయ్యాయి.

రణరంగంలా మారిన దుబ్బాక..

దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. దుబ్బాక ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీల ముఖ్య నేతలంతా సిద్దిపేటకు చేరుకోవడంతో రణరంగాన్ని తలపిస్తోంది.