కమల్ హాసన్ కి నిద్ర లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదిగో వస్తున్నాడిదిగో అంటూ చీకటిరాజ్యం ట్రైలర్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ నడుస్తోంది. దానికి తగ్గట్టు ఈ రోజు సాయంత్రం ఆ సినిమా ట్రైలర్‌ను విడుదలచేశారు. రాజేష్ దర్శకత్వంలో కమల్ నటించిన సినిమా చీకటి రాజ్యం. త్రిష, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రధారులు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై చారుహాసన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం 4.21కి విడుదల చేశారు. అసలు జ్యోతిష్యంను, మంచి సమయాన్ని నమ్మని కమల్‌హాసన్ 4.21కే ఎందుకు ట్రైలర్‌ను విడుదల చేశారు? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. కానీ వైద్యపరిభాషలో 4.21అనే సంఖ్య నిద్రలేమిని సూచిస్తుందట. ఈ సినిమా పేరు కూడా చీకటిరాజ్యం. ఇందులో నిద్రలేమి ఎవరికి ఉంది? దాని వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది వంటి వివరాలతో సినిమాను రూపొందించినట్టు సమాచారం.జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments