దీపావళికి స్కెచ్ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు వారికి చేరువైన తమిళ కథానాయకుడు విక్రమ్. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటైన స్కెచ్ చిత్రం ముందుగా విడుదల కానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నారు. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. విక్రమ్, తమన్నా కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమైన స్కెచ్‌లో.. గ్లామర్‌కి స్కోప్ లేని పాత్రలో మిల్కీ బ్యూటీ కనిపించనుందని తెలిసింది. అపరిచితుడు తరువాత సరైన విజయం లేని విక్రమ్‌కి ఈ చిత్రమైనా సక్సెస్‌ని అందిస్తుందేమో చూడాలి. యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న స్కెచ్ డిసెంబర్ 22న విడుదలయ్యే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com